అడిగినంత ఇవ్వనందుకే చరణ్ కి నో చెప్పిందా..?

Update: 2018-10-30 06:34 GMT

గత నాలుగు రోజులుగా ధృవ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా నటించి ఆ సినిమాతో మంచి హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు చరణ్ సినిమాకి నో చెప్పిందని న్యూస్ మాములుగా ప్రచారం జరగడం లేదు. అసలే అవకాశాలు చేతిలో లేని టైంలో రకుల్ ప్రీత్ ఇలా చరణ్ తో కలిసి డ్యాన్స్ చేసే ఆఫర్ కి నో ఎందుకు చెప్పింది చెప్మా అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. ఇంతకీ రకుల్ చరణ్ కి ఎందులో నో చెప్పిందంటే.. బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ - కియారా అద్వానీలు జంటగా తెరకెక్కుతున్న RC12 సినిమాలో ఐటెం సాంగ్ కోసం సంప్రదించగా.. రకుల్ మాత్రం నో చెప్పిందని టాక్ ఫిలిం సర్కిల్స్ లో నడిచింది.

ఒక్క పాటకు కోటి రూపాయలా..?

మరి కోలీవుడ్ లో తప్ప టాలీవుడ్ క్రేజీ సినిమాలేవీ చేతిలో లేని టైంలో తనకి డేట్స్ ఖాళీ లేవంటూ చరణ్ ఆఫర్ కి నో చెప్పిందన్నారు. అయితే రకుల్ ప్రీత్ కి డేట్స్ ఖాళీ లేక రామ్ చరణ్ సినిమాలో ఐటెం సాంగ్ కి నో చెప్పలేదట. మరేదో కారణముందట. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో శ్రీదేవి పాత్ర లో నటిస్తుంది రకుల్ ప్రీత్. అయితే ఎన్టీఆర్ బయోపిక్ లో కేవలం 20 నిమిషాల గెస్ట్ రోల్ కోసం రకుల్ ఏకంగా కోటి వసూలు చేస్తుందట. మరి క్రేజీ ఎన్టీఆర్ బయోపిక్ కోసం కోటి వసూలు చేసే రకుల్ రామ్ చరణ్ సినిమాలో ఐటెం సాంగ్ కోసం కూడా కోటి డిమాండ్ చేసిందట.

రకుల్ డిమాండ్ వినగానే...

మరి బాలీవుడ్ భామల కోసం కోట్లు ఖర్చు పెట్టాలని అనుకుని చివరికి... అంత బడ్జెట్ లేకనే టాలీవడ్ భామల కోసం సర్దుకుపోయిన బోయపాటి - రామ్ చరణ్ లకు రకుల్ డిమాండ్ చేసిన కోటి సంగతి వినగానే.. మారు మాట్లాడకుండా మరో హీరోయిన్ కోసం వెతుకులాట మొదలెట్టారట. మరి RC12 షూటింగ్ పూర్తి కావొస్తుంది కాబట్టి.. ఈ సినిమాలో ఐటెం కూడా పూర్తి చెయ్యాలని బోయపాటి చూస్తున్నాడట. మాస్ తో రెచ్చిపోయే ఆ ఐటెం లో చెర్రీ తో కలిసి మాస స్టెప్స్ తో ఆలారించబోయే ఆ ఐటెం గర్ల్ ఎవరనేది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.

Similar News