రకుల్ కి బాయ్ ఫ్రెండ్ కావాలంట..!

Update: 2018-11-21 06:42 GMT

అప్పుడప్పుడు మన హీరోయిన్స్ చెప్పే మాటలు ఎవరికీ అర్ధం కావు. రీసెంట్ గా రకుల్ చెప్పిన మాటలు కూడా ఎవరికీ అర్ధం కావట్లేదు. తెలుగులో చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమె చాలా తక్కువ కాలంలోనే పెద్ద స్టార్స్ పక్కన చేసే ఛాన్స్ కొట్టేసింది. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో కూడా చేసే ఛాన్స్ కొట్టేసిన రకుల్ ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీకి మాత్రం బాగా దూరం అయింది.

కావాలని దూరం కాలేదు...

కారణమేంటి అని అడిగితే... నేను ప్రస్తుతం కోలీవుడ్ లో మూడు సినిమాలు.. బాలీవుడ్ లో మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా... అందుకే తెలుగు మీద అంతగా దృష్టి పెట్టలేకపోతున్నా. అంతేగాని నేను కావాలని తెలుగు సినిమాలని దూరం పెట్టట్లేదు అని కొంచం గట్టిగానే చెప్పింది. రీసెంట్ గా ఆమె తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీదేవి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడైతే చేతిలో ఆఫర్స్ ఉన్నాయి మరి తరువాత పరిస్థితి ఏంటి అని ఆలోచించుకుని తనకు హైదరాబాద్ లేదా ముంబైలో ఒక బాయ్ ఫ్రెండ్ ని సెట్ చేయమని అని తన ఫ్రెండ్స్ కి సన్నిహితులకు పదేపదే చెబుతుందని రకుల్ లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

బాయ్ ఫ్రెండ్ కావాలంట...

ఆమె గతంలో రానా దగ్గుబాటితో కొన్నాళ్లు లవ్ ట్రాక్ నడిపింది. ఆ తరువాత బాలీవుడ్ హీరో సిద్దార్ధ్ మల్హోత్రాతో కొన్నాళ్లు లవ్ ట్రాక్ ను నడిపిన రకుల్ ఇప్పుడు సడన్ గా ఒక బాయ్ ఫ్రెండ్ కావాలని ఇలా అడుగుతుందేంటీ అని ఎవరికి అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. 'సింగిల్ అండ్ రెడీ టూ మింగిల్' అంటున్న రకుల్ కు సరిపోయే ఆ కలల రాకుమారుడు ఎవరో?..

Similar News