పిక్ టాక్ : నేనున్నానని గుర్తుంచుకోండి : రకుల్..!

Update: 2018-11-20 08:37 GMT

'వెంటాద్రి ఎక్స్ ప్రెస్'తో వెండితెరకు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. ఇక్కడ ఆఫర్స్ వస్తున్న టైంలోనే కోలీవుడ్ లో ఎలాగైనా సినిమాలు చేయాలని ప్లాన్ వేసింది. అనుకున్నదే తడవుగా కార్తీతో గత ఏడాది 'ఖాకీ'లో చేసింది. ఆమె పాత్రకు మంచి పేరు రావడమే కాదు అందరి దృష్టిలో పడింది.

కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి...

దీంతో ఆమెకు వరసబెట్టి అక్కడ సినిమాల మీద సినిమాలు రావడం స్టార్ట్ అయ్యింది. కార్తీ - రకుల్ కెమిస్ట్రీ బాగుండటంతో మరో సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు కార్తీ. 'దేవ్' సినిమాలో చేస్తున్న రకుల్ కు కార్తీ తన అన్నయ్య సూర్య మూవీలో వేషం ఇప్పించాడు. ఆలా అన్నదమ్ముల సినిమాలతో రకుల్ మహా బిజీగా ఉంది. ఇక రీసెంట్ గా శివ కార్తికేయన్ సరసన కూడా మరో ఛాన్స్ కొట్టేసింది. బాలీవుడ్ లో కూడా గత ఏడాది 'అయారి' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరో అజయ్ దేవగన్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.

హాట్ స్టిల్ వదిలి...

రకుల్ ఈమధ్య ఫిట్ నెస్ తో పాటు గ్లామర్ డోస్ బాగా పెంచేస్తోంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ స్టిల్స్ తో యూత్ ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఆ మధ్య మాక్సిం పత్రిక కోసం ఇచ్చిన స్టిల్స్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అయ్యాయి. ఇప్పుడు అటువంటి స్టిల్ ఒకటి వదిలి ఫ్యాన్స్ కు గిఫ్ట్ ఇచ్చింది. హాఫ్ బికినీ వేసి కింద బ్లూ జీన్స్ తో కూర్చుని తెలుగు దర్శకులకి నేను ఇంకా ఉన్నాననే గుర్తు చేస్తుంది. మరి తెలుగు దర్శకులు ఈ స్టిల్స్ చూసి ఏమైనా ఆఫర్ ఇస్తారేమో చూడాలి.

Similar News