రకుల్ ప్రీత్ సింగ్ కల నెరవేరింది..!

తెలుగుతెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యి చిన్న హీరోస్ నుండి పెద్ద హీరోల వరకు అందరితో సినిమాలు చేసిన రకుల్ ఆ తరువాత మెల్లిగా స్టార్ హీరోయిన్ [more]

Update: 2019-05-21 07:55 GMT

తెలుగుతెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యి చిన్న హీరోస్ నుండి పెద్ద హీరోల వరకు అందరితో సినిమాలు చేసిన రకుల్ ఆ తరువాత మెల్లిగా స్టార్ హీరోయిన్ హోదాను అనుభవించింది. తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన రకుల్ కి ఎందుకో తెలుగు, తమిళంలో గత కొంతకాలం నుండి సక్సెస్ రాలేదు. అయితే ఈసారి ఆమెకు సక్సెస్ వచ్చింది. అది కూడా బాలీవుడ్ లో. బాలీవుడ్ లో సినిమా చేసి సక్సెస్ అవ్వాలని ఆమెకు ఓ కోరిక ఉండేది. దీంతో ఆమె కోరిక తీరిపోయింది.

బాలీవుడ్ లో తొలి సక్సెస్

అజయ్ దేవగన్ తో కలిసి దేదే ప్యార్ దే అనే సినిమా గత శుక్రవారం విడుదలై మొదటి రోజు మిక్స్ డ్ టాక్ దక్కించుకుంది. కానీ రెండో రోజు పర్లేదు సినిమా బాగానే ఉంది అన్నారు. ఇక వీకెండ్ ముగిసేసరికి సినిమా హిట్ రేంజ్ కు వెళ్లిపోయింది. పైగా సినిమా చూసినవాళ్లు రకుల్ నటన గురించి మాట్లాడుతున్నారు. హిందీలో ఈమె రెండుసార్లు ఫెయిల్ అయింది. మూడో ప్రయత్నంగా చేసిన దేదే ప్యార్ దే సినిమా మాత్రం సక్సెస్ అవ్వడంతో రకుల్ ఆనందానికి అవధుల్లేవ్. అలా ఈ అమ్మడికి బాలీవుడ్ లో తొలి విజయం దక్కింది.

Tags:    

Similar News