రకుల్ రేంజ్ ఎంత తగ్గిందో చూసారా..?

ఇప్పటికే మీడియం, స్టార్ హీరోల పక్కన అవకాశాలు కోల్పోయిన రకుల్ ప్రీత్ సింగ్ సీనియర్ హీరోలతో అడ్జెస్ట్ అవుతుంది. తెలుగు, తమిళంలో ఏకకాలంలో ఫెయిల్ అయిన రకుల్ [more]

Update: 2019-04-02 08:36 GMT

ఇప్పటికే మీడియం, స్టార్ హీరోల పక్కన అవకాశాలు కోల్పోయిన రకుల్ ప్రీత్ సింగ్ సీనియర్ హీరోలతో అడ్జెస్ట్ అవుతుంది. తెలుగు, తమిళంలో ఏకకాలంలో ఫెయిల్ అయిన రకుల్ కి బాలీవుడ్ లో రెండు మూడు అవకాశాలున్నాయి. అక్కడ బాలీవుడ్ వాళ్లు రెడ్ కార్పెట్ పరవకపోయినా రకుల్ మాత్రం తానొక బాలీవుడ్ హీరోయిన్ అనేలా జీరో సైజుతో హంగామా చేస్తుంది. తాజాగా తెలుగు, తమిళనాట చిన్న, సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తూ తన రేంజ్ తగ్గించుకుంది. అయితే చిన్న, సీనియర్ హీరోలతో సినిమాలు చేసినా పారితోషకం విషయంలో మాత్రం తగ్గడం లేదనే మాట వినబడుతుంది.

క్రేజ్ తగ్గడంతో కళ్యాణ్ రామ్ తో

మన్మధుడు 2లో నాగ్ సరసన నటిస్తున్న రకుల్ రెండు కోట్ల పారితోషకం అందుకుంటుందని ప్రచారం జరుగుతుంది. తాజాగా రకుల్ ప్రీత్ కళ్యాణ్ రామ్ సినిమాలో నటిస్తుందని అంటున్నారు. ఫేమ్ తగ్గాక హీరోయిన్స్ అందరితో అడ్జెస్ట్ అయినట్లుగానే ఇప్పుడు రకుల్.. కళ్యాణ్ తో జోడి కడుతుంది. అంటే కాజల్, తమన్నా లాంటి వాళ్లు క్రేజ్ తగ్గగానే కళ్యాణ్ రామ్ లాంటి హీరోలతో సర్దుకుపోయారు. ప్రస్తుతం క్రేజ్ తగ్గిన కారణంగానే రకుల్.. కళ్యణ్ రామ్ సినిమా తుగ్లక్ లో నటించడానికి ఒప్పేసుకుందనే మాట వినబడుతుంది.

Tags:    

Similar News