అక్కడ ఒకే.. మరి ఇక్కడ..!

రకుల్ చాన్నాళ్లుగా సౌత్ లో హిట్ కొట్టలేక చతికిలపడింది. అలాగే సౌత్ లో అవకాశాలు కూడా తగ్గాయి. ఈలోపు బాలీవుడ్ నుండి అవకాశం రాగానే అక్కడికి ఎగిరిపోయింది [more]

Update: 2019-05-31 06:36 GMT

రకుల్ చాన్నాళ్లుగా సౌత్ లో హిట్ కొట్టలేక చతికిలపడింది. అలాగే సౌత్ లో అవకాశాలు కూడా తగ్గాయి. ఈలోపు బాలీవుడ్ నుండి అవకాశం రాగానే అక్కడికి ఎగిరిపోయింది ఈ భామ. కాకపోతే బాలీవుడ్ కి వెళ్లాక సౌత్ లోనూ కాస్త అవకాశాల జోరు పెరిగింది. తెలుగులో ఇప్పటికే మన్మధుడు 2లో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మరో సినిమాకి సైన్ చేసింది కూడా. ఇక తమిళనాట దేవ్ అట్టర్ ఫ్లాప్ తో ప్రస్తుతం సూర్య తో కలిసి నటించిన ఎన్జీకే సినిమా మీదే అమ్మడు ఆశలు పెట్టుకుంది. ఇక బాలీవుడ్ లో కూడా దే దే ప్యార్ దేతో 100 కోట్ల క్లబ్బులో చేరిన రకుల్ ఇప్పుడు ఎన్జీకేతో కూడా హిట్ అయితే సౌత్ లో మళ్లీ రకుల్ ప్రీత్ హవా పెరుగుతుంది.

ఎన్జీకే హిట్ అయితే…

ఈ రోజు విడుదల కాబోతున్న ఎన్జీకే సినిమాలో రకుల్ వన్ అఫ్ ద హీరోయిన్స్. మరి ఈ సినిమాలో సాయి పల్లవి డామినేషన్ ని తట్టుకుని రకుల్ ప్రీత్ ఎంతవరకు నెగ్గుతుంది అనేది చూడాలి. ఈ సినిమా గనుక హిట్ అయితే మాత్రం రకుల్ ప్రీత్ కి సౌత్ లో మరింత క్రేజ్ పెరుగుతుంది. ఎలాగూ బాలీవుడ్ లో క్లిక్ అయిన రకుల్ కి సౌత్ కూడా అవకాశాలు ఇస్తుంది. ఇప్పటికే సౌత్ లో టాప్ హీరోలందరి సరసన నటించిన ఈ భామకు ఎన్జీకే హిట్ అయ్యిందా.. ఇక ఆపడం కష్టమే సుమీ..!

Tags:    

Similar News