ఇక్కడా.. అక్కడా రకుల్ కి పోటీ వస్తుందా..?

ఛలోతో నెమ్మదిగా తెలుగులోకి అడుగుపెట్టి… గీత గోవిందం బ్లాక్ బస్టర్ తో పాతుకుపోయిన రష్మిక టాలీవడ్ లో తన కెరీర్ ని చక్కబెట్టుకుంటుంది. ఇప్పటికే తనకి అచ్చొచ్చిన [more]

Update: 2019-02-26 07:12 GMT

ఛలోతో నెమ్మదిగా తెలుగులోకి అడుగుపెట్టి… గీత గోవిందం బ్లాక్ బస్టర్ తో పాతుకుపోయిన రష్మిక టాలీవడ్ లో తన కెరీర్ ని చక్కబెట్టుకుంటుంది. ఇప్పటికే తనకి అచ్చొచ్చిన హీరో విజయ్ దేవరకొండతో మరోసారి డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్న రష్మిక, నితిన్ తోనూ భీష్మ చిత్రంలో నటిస్తుంది. ప్రస్తుతం మీడియం అండ్ యంగ్ హీరోలంతా రష్మిక వైపే చూస్తున్నారు. ఎలాగూ తెలుగులో క్రేజ్ ఉన్న హీరోయిన్స్ కొరత ఉంది. అప్పట్లో అందరికీ ఏకైన ఆప్షన్ గా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ స్పైడర్ దెబ్బకి టాలీవుడ్ లో ఆఫర్స్ కోసం అర్రులు చాచాల్సిన పరిస్థితి. అలాంటి టైం లోనే రష్మిక మెల్లగా రకుల్ కి తెలుగులో చెక్ పెట్టేసింది. ప్రస్తుతం తెలుగులో రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక మందన్నా ఇప్పుడు తమిళంలోనూ కాలు పెట్టింది.

తమిళంలోనూ పోటీ…

తమిళనాట కార్తీ హీరోగా డ్రీం వారియర్స్ నిర్మిస్తున్న చిత్రంలో రష్మిక హీరోయిన్ గా ఎంపికైంది. మరి తెలుగులో హీరోయిన్ గా పాతుకుపోతున్న రష్మిక తమిళంలోనూ పాగా వెయ్యడం ఖాయంగానే కనబడుతుంది. ప్రస్తుతం రెండు సినిమాలతో అక్కడ రకుల్ కాస్త బిజీగా ఉంది. ఇక రకుల్ కి నిన్నగాక మొన్న కార్తీతో కలిసి నటించిన దేవ్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇక సూర్యతో ఎన్జీకే సినిమాలో నటిస్తున్న రకుల్ ప్రీత్ కి ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ దొరికింది. ఆ సినిమా సూపర్ హిట్ అయినా… మొత్తం క్రెడిట్ సూర్యకి, మొదటి హీరోయిన్ సాయి పల్లవికి వెళ్లిపోతుంది. మరి రష్మిక, కార్తీతో కలిసి నటించే చిత్రం గనక హిట్ అయ్యింది అంటే.. రష్మిక అక్కడ కూడా రకుల్ కి స్పాట్ పెట్టేస్తుందనే టాక్ నడుస్తుంది.

అక్కడా ఛాన్స్ పోతుందా..?

మరి తెలుగులో ఆఫర్స్ కోసం అల్లాడుతున్న రకుల్ ప్రీత్ తాజాగా సీనియర్ హీరో నాగార్జునతో సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాగ్ హీరోగా వస్తున్న మన్మధుడు 2 లో రకుల్ ప్రీత్ హీరోయిన్ అంటున్నారు. ఇక బెల్లంకొండ సరసన ఛాన్స్ దక్కుతుందనుకుంటే.. అది కాస్తా అనుపమ తన్నుకుపోయింది. ఇక తాజాగా తమిళంలోనూ రష్మిక అడుగుపెట్టడంతో.. రకుల్ కి అక్కడ కూడా అవకాశాలు సన్నగిల్లేలా కనబడుతుంది వ్యవహారం.

Tags:    

Similar News