బాలయ్య సమస్య తీర్చిన రకుల్..!

స్పైడర్ కి ముందు వరకు వరుస సినిమాలతో బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ స్పైడర్ తరువాత తెలుగులో కనిపించడం మానేసింది. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో తమిళ [more]

Update: 2019-02-07 09:17 GMT

స్పైడర్ కి ముందు వరకు వరుస సినిమాలతో బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ స్పైడర్ తరువాత తెలుగులో కనిపించడం మానేసింది. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో తమిళ సినిమాల పైనే ఎక్కువ ఫోకస్ చేసింది. తెలుగులో రీసెంట్ గా ఎన్టీఆర్ కథానాయకుడులో చిన్న పాత్రతో అలరించిన అది కూడా డిజాస్టర్ అవ్వడంతో రకుల్ ఆశలు మరోసారి గల్లంతయ్యాయి. దాంతో ఎలాగైనా తెలుగులో ఒక్క హిట్ అయినా కొట్టాలని కంకణం కట్టుకుని కూర్చుంది.

బాల‌య్య ప‌క్క‌న సెట్ అవుతుందా..?

ఈ నేపథ్యంలో రకుల్ కు ఓ భారీ కాంబినేషన్ సినిమాలో ఆఫర్ వచ్చింది. మాస్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్‌లో నందమూరి బాలకృష్ణ తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు. హీరోయిన్ కోసం రకుల్ ని సంప్రదిస్తే ఓకే చెప్పిందట. త్వరలోనే ఫుల్ స్క్రిప్ట్ తో వస్తానని మాట ఇచ్చాడట బోయపాటి. ఇక బాలయ్య విషయానికి వస్తే ఆయనకు ఏ హీరోయిన్ అయినా ఓకే. అసలే బాలయ్యకు హీరోయిన్స్ దొరకడం కష్టం అయిపోయింది. ఇప్పుడు రకుల్ రూపం లో బాలయ్యకు ఆ సమస్య తీరిపోయింది. మరి రకుల్ బాలయ్య పక్కన సరిపోతుందా? లేదా? చూడాలి. నాగచైతన్య – వెంకటేష్ కాంబినేషన్ లో వస్తున్నా ‘వెంకీమామ’ సినిమాలో కూడా రకుల్ నటించబోతుంది. మరి ఈ రెండు సినిమాలతో అయినా కం బ్యాక్ అవుతుందో లేదో చూద్దాం.

Tags:    

Similar News