శ్రీదేవిగా రకుల్ ఓకేనా..!

Update: 2018-10-10 11:53 GMT

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో ఎన్టీఆర్ బయోపిక్ శరవేగంగా రూపు దిద్దుకోవడమే కాదు... రోజుకో సంచలనంతో సంచలనాలకు కేరాఫ్ గా నిలుస్తుంది. ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడిగా రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. ప్రస్తుతం కథానాయకుడు పాత్రలతో కిర్రెక్కిస్తున్న క్రిష్... ఎన్టీఆర్ గా బాలకృష్ణ ని ఏఎన్నార్ గా సుమంత్ ని చంద్రబాబుగా రానా పాత్రలను అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఇప్పటికే ఆ పాత్రలకు ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రమే కాదు... రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముచ్చటపడిపోతున్నారు.

అచ్చం శ్రీదేవిలా...

తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీదేవి పాత్రలో నటిస్తున్న టాప్ హీరోయిన్ రాకుల్ కూడా శ్రీదేవి గా బయటికొచ్చేసింది. అతిలోక సుందరి శ్రీదేవిగా రకుల్ బాగుంది. శ్రీదేవి కట్టుబొట్టు అన్నీ సేమ్ టు సేమ్ రకుల్ కూడా దింపేసింది. అందులోను శ్రీదేవి పోలికలతో రకుల్ ఉండడం ఆ పాత్రకు ప్లస్ అయ్యింది. క్రిష్ కేవలం పాత్రలతోనే ఇలా సంచలనాలు నమోదు చేస్తుంటే సినిమాతో మరెన్ని రికార్డ్స్ కొల్లగొడతాడో అంటున్నారు. ఇక కథానాయకుడు జనవరి 9న మహానాయకుడుని జనవరి 24 విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Similar News