అవకాశాల కోసం రకుల్ పక్క చూపులు

ప్రస్తుతం రకుల్ ప్రీత్ టాలీవుడ్, తమిళ్, బాలీవడ్ లో చేతిలో ఒకటో రెండో సినిమాలు ఉన్నాయి. కానీ రకుల్ కి సక్సెస్ అనేది తగలడం లేదు. చేతిలో [more]

Update: 2019-12-26 12:47 GMT

ప్రస్తుతం రకుల్ ప్రీత్ టాలీవుడ్, తమిళ్, బాలీవడ్ లో చేతిలో ఒకటో రెండో సినిమాలు ఉన్నాయి. కానీ రకుల్ కి సక్సెస్ అనేది తగలడం లేదు. చేతిలో ఉన్న సినిమాల్లో గ్లామర్ ఒలకబోసే పాత్రలకు టెంప్ట్ అవ్వాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ప్రయోగాలకు సిద్ధమంటూ రకుల్ హింట్స్ ఇస్తున్నప్పటికీ… దర్శకనిర్మాతలెవరు రకుల్ ని పట్టించుకోవడం లేదు. అందుకే రకుల్ తాజాగా ఓ ఆలోచన చేస్తున్నదని టాక్. అదేమిటంటే సినిమాల్లో ప్రయోగాలకు అవకాశాలు రావడం లేదు కాబటి.. ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్న డిజిటల్ ప్లాట్ ఫామ్ మీద తన కోరిక తీర్చుకోవాలని డిసైడ్ అయినట్లుగా ఫిలింనగర్ టాక్.

ప్రస్తుతం సమంత అమెజాన్ వెబ్ సీరీస్ లో నటిస్తుంది. ఆ వెబ్ సీరీస్ లో సమంత కొత్తగా నెగెటివ్ పాత్రలో నటిస్తుంది. నటనలో ఛాలెంజింగ్ రోల్ లో నటించాలని సమంత ఎప్పటి నుండొ అనుకుంటుంది. అందుకే సమంత డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ద ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ ఎంచుకుంది. మరి రకుల్ కూడా సినిమాల్లో ఎలాగూ అవకాశాలు లేవు కాబట్టి ఇలా డిజిటల్ స్ట్రీమింగ్ లో వెబ్ సీరీస్ తో ప్రయోగాలకు ఇంపార్టెన్స్ ఇస్తూ.. ఛాలెంజింగ్ రోల్స్ చెయ్యాలని అనుకుంటుదేమో..అందుకే ఇలా సినిమాల కన్నా ప్రస్తుతం క్రేజ్ ఉన్న డిజిటల్ ఫ్లాట్ ఫామ్ బెటరని అనుకుంటుంది.

Tags:    

Similar News