పిల్ల పిటపిటలాడినా.. ఉపయోగం ఏముంది

రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో ప్లాప్, కోలీవుడ్ ప్లాప్, తాజాగా బాలీవుడ్ ప్లాప్. అయినా అమ్మడు ఏ మాత్రం తగ్గడం లేదు. గ్లామర్ డోస్ అంతకంతకు పెంచుతూనే [more]

Update: 2019-11-17 11:28 GMT

రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో ప్లాప్, కోలీవుడ్ ప్లాప్, తాజాగా బాలీవుడ్ ప్లాప్. అయినా అమ్మడు ఏ మాత్రం తగ్గడం లేదు. గ్లామర్ డోస్ అంతకంతకు పెంచుతూనే ఉంది. అయినా వర్కౌట్ అవ్వడం లేదు. తెలుగులో డిజాస్టర్ సినిమాలు చేస్తున్న రకుల్ ప్రీత్ ఎప్పుడో ఫెడవుట్ అయ్యింది. కోలీవుడ్ లో లోను రకుల్ కి షాకుల మీద షాకులిస్తున్నాయి. ఇక కమల్ సర్ ని నమ్ముకున్న రకుల్ కి ఇండియన్ టు ఏం చేస్తుందో తెలియదు. తాజాగా బాలీవుడ్ లోని మార్జావ ప్లాప్ టాక్ తో రకుల్ అయోమయంలో పడింది. ఎమన్నా అంటే రకుల్ పనైపోయింది అంటారు అంటూ గుంజుకునే రకుల్ కి మూడు భాషల్లోనూ షాకులు తప్పడం లేదు.

అయినా గ్లామర్ విషయంలో వెనకడుగు వెయ్యకుండా రోజు రోజుకి గ్లామర్ డోస్ పెంచడమే ధ్యేయంగా పెట్టుకుంది. ఇప్పుడు తాజాగా రకుల్ సోషల్ ఇండియాలో పోస్ట్ చేసిన పిక్ లో పిల్ల చూస్తే పిటపిటలాడుతుంది.. కానీ ఏం లాభం అంటూ నెటిజెన్స్ జాలి చూపిస్తున్నారు. ఏదో సమంత లా అవకాశాలు అందుకుంటూ పైపైకి పోతుంది అనుకుంటే… ఎంత త్వరగా స్టార్ డమ్ తెచ్చుకుందో అంత త్వరగా ప్లాప్ లిస్ట్ లోకి చేరిపోయింది రకుల్. కారణం కథల ఎంపిక చేసిన పొరబాటు. ఏదో అవకాశం ఉంటే చాలు… హీరో ఎవరైతే నాకేంటి అంటూ సీనియర్ హీరోల పక్కన నటించి బాగా దెబ్బతింది. ఇప్పుడు రకుల్ కి ఆ సీనియర్ హీరోలు తప్ప కుర్ర హీరోలు ఛాన్స్ ఇచ్చేలా కనిపించడం లేదు. పాపం రకుల్ ఎంత గ్లామర్ షో చేసినా.. ఎన్ని అందాలు చూపించినా వేస్టే మరి.

Tags:    

Similar News