సీనియర్ హీరోలు వదలలేకపోతున్నారా?

ఇప్పుడు కుర్ర హీరోలు, స్టార్ హీరోల చూపు పూజాహెగ్డే, రష్మిక మందన్నలా మీద ఉంటే.. సీనియర్ హీరోల చూపు రకుల్ ప్రీత్ సింగ్ మీద ఉంది. హీరోయిన్ [more]

Update: 2019-11-18 06:59 GMT

ఇప్పుడు కుర్ర హీరోలు, స్టార్ హీరోల చూపు పూజాహెగ్డే, రష్మిక మందన్నలా మీద ఉంటే.. సీనియర్ హీరోల చూపు రకుల్ ప్రీత్ సింగ్ మీద ఉంది. హీరోయిన్ గా టాప్ లేపుతుంది అనుకున్న తరుణంలో స్టార్, కుర్ర హీరోలు పక్కన బెట్టేసిన రకుల్ కి ఇప్పుడు సీనియర్ హీరోలే దిక్కవుతున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లలో రకుల్ ప్రీత్ కి సీనియర్ హీరోల నుండే ఆఫర్స్ వస్తున్నాయ్. తెలుగులో నాగార్జున, తమిళనాట కమల్ హాసన్, బాలీవుడ్ లో అజయ్ దేవగన్…ఇలా రకుల్ సీనియర్ హీరోలకే సెటిల్ అయ్యేలా కనబడుతుంది. ఇక తెలుగులో నాగార్జున తో కలిసి నటించిన మన్మధుడు 2 డిజాస్టర్.

మరి డిజాస్టర్ సినిమాలో నటించిన రకుల్ కి నాగార్జున మరో సినిమాకి అవకాశం ఇచ్చాడనే న్యూస్ ఉంది చూశారూ… అది చూస్తుంటే అబ్బా రకుల్ ని సీనియర్ హీరోలు వదల్లేకపోతున్నారనిపిస్తుంది. లేదంటే ఒక సినిమాతో ప్లాప్ కొట్టాక కూడా మరో సినిమాకి అది వెంటనే అవకాశం అంటే ఆలోచించాల్సిందే. కానీ నాగార్జున.. కొత్త దర్శకుడు సోలొమన్ తో చెయ్యబోయే సినిమా కోసం రకుల్ కి పిలిచి అవకాశం ఇచ్చాడనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తుంది. వంశీ పైడిపల్లి దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేసిన సోలమన్… ఇప్పుడు నాగ్ ని డైరెక్ట్ చెయ్యబోతున్న విషయం తెలిసిందే. మరి మన్మధుడు 2 లో రకుల్, నాగ్ ముందు తేలిపోయింది. అయినప్పటికి.. నాగార్జున, రకుల్ ని మళ్ళీ పిలిచాడంటే అది రకుల్ అదృష్టమే

Tags:    

Similar News