అవంతిక వెరీ హాట్.. అందుకే A సర్టిఫికెట్

రాహుల్ రామకృష్ణ దర్శకుడిగా నాగార్జున – రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న మన్మధుడు 2 సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కామెడీ రొమాంటిక్ [more]

Update: 2019-07-09 06:08 GMT

రాహుల్ రామకృష్ణ దర్శకుడిగా నాగార్జున – రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న మన్మధుడు 2 సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ టీజర్ గత నెలలో విడుదలవగా.. ఆ టీజర్ లో నాగార్జున మన్మధుడు 2 లో ఎలా వుండబోతున్నాడో.. అతని పాత్ర స్వభావంతో పాటుగా… లుక్ అన్ని రివీల్ చేసాడు దర్శకుడూర్ రాహుల్. తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పాత్రని కూడా ఈ రోజు మంగళవారం పరిచయం చేసాడు. అవంతిక పాత్రలో రకుల్ కొంచెం హాట్ కొంచెం నీట్ గా స్పైసి లుక్స్ తో ఇరగదీసింది.

నటి లక్ష్మీ… రకుల్ ని అవంతిక గా సంప్రదాయమైన, పద్దతి గల పిల్లగా పరిచయం చేస్తుంది. ముందు పద్దతిగానే కనిపించిన రకుల్ హాట్ హాట్ గా నాగార్జునతో సరసమాడుతూ…. ఇప్పటివరకు యూ సర్టిఫికెట్ నే ట్రై చేసాను.. ఇప్పటినుండి A సర్టిఫికెట్ ని చూపిస్తా అంటూ… సిగరెట్ తాగుతూ అందరికి షాకిచ్చింది. మరి ఇంట్లో పద్దతిగా ఉండే అమ్మాయి…. బయటికొస్తే మాత్రం రెచ్చిపోయి స్మోకింగ్ గట్రా చేస్తుందని… అలా అల్లరి పిల్లగా నాగార్జున ని పడెయ్యడానికి ట్రై చేసే పాత్రలో రకుల్ ని చూపించాడు రాహుల్. మరి రకుల్ పాత్ర ని చూస్తుంటే మన్మధుడు 2 లో హాట్ హాట్ గా రెచ్చిపోవడం ఖాయంగానే కనబడుతుంది

Tags:    

Similar News