రకుల్ పరిస్థితి ఏమిటి?

రకుల్ ప్రీత్ సింగ్ కి తెలుగులో ఉన్న ఏకైన సినిమా మన్మధుడు 2. ఇప్పుడు మన్మధుడు 2 కూడా ప్రేక్షకులముందుకు వచ్చేసింది. నిన్న వరల్డ్ వైడ్ గా [more]

Update: 2019-08-10 05:06 GMT

రకుల్ ప్రీత్ సింగ్ కి తెలుగులో ఉన్న ఏకైన సినిమా మన్మధుడు 2. ఇప్పుడు మన్మధుడు 2 కూడా ప్రేక్షకులముందుకు వచ్చేసింది. నిన్న వరల్డ్ వైడ్ గా విడుదలైన మన్మధుడు 2 కి ప్రేక్షకులు యావరేజ్ టాక్ ఇచ్చారు. రాహుల్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ నాగ్ సరసన టీనేజ్ అమ్మాయిలా నటించింది. మన్మధుడు 2 లో రకుల్ ప్రీత్ నాగార్జున కి అద్దెకొచ్చిన లవర్ అవంతిక పాత్రలో నటించింది. ఏజెడ్ హీరో నాగ్ సరసన రకుల్ టీనేజ్ అమ్మాయిగా బాగానే సెట్ అయ్యింది. అయితే సినిమాకొచ్చిన టాక్ వలన రకుల్ కి ఏం వరుగుతుందో తెలియని పరిస్థితి.

అయితే ఈ సినిమాలో నటన పరంగా నాగార్జున కన్నా రకుల్ ప్రీత్ సింగ్ కే ఎక్కువ మార్కులు పడతాయి. తొలిసగంలో అందాలు ఆరబోసినా.. టీనేజ్ అమ్మాయిగా కవ్వించే చూపులు విసిరినా…. క్లయిమాక్స్ లో ఎమోషన్ బాగా పండించింది. రకుల్ బోల్డ్ లుక్స్.. యాక్టింగ్ తో ఓకే అనిపించింది. గత సినిమాలతో పోలిస్తే రకుల్ భిన్నంగా కనిపించిందీ సినిమాలో. అయితే అవంతిక పాత్ర తేలిపోవడంతో రకుల్ ప్రత్యేకమైన ముద్ర వేయలేకపోయింది. పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర కాకపోయినప్పటికీ పర్వాలేదనిపించింది. ఇక సినిమాలో నాగార్జున తో రకుల్ కెమిస్ట్రీ కూడా పరవాలేదనిపిస్తుంది. మరి ప్రస్తుతం తెలుగులో ఏం సినిమాలు కూడా రకుల్ చేతిలో లేవు. తమిళనాట మాత్రం రెండు సినిమాల్లో రకుల్ నటిస్తుంది. ఇక మన్మధుడు 2 కూడా హిట్ కాకపోయేసరికి ఇపుడు రకుల్ పరిస్థితి ఏమిటా అని అందరూ తెగ చర్చించేస్తున్నారు.

Tags:    

Similar News