అప్పుడు కాజల్.. ఇప్పుడు రకుల్

Update: 2018-10-29 02:21 GMT

టాలీవుడ్ లో కోలీవుడ్ లో హీరోయిన్స్ గ్లామర్ గేట్లు తెరిచేందుకు కాస్త సందేహిస్తారు. ఎంతగా ఎక్సపోజింగ్ చేసినా.... చాలా జాగ్రత్తగా చేస్తారు. కాజల్ అగర్వాల్, సమంత, రకుల్ ప్రీత్ ఇలా చాలామంది టాలీవుడ్ లో హాట్ హీరోయిన్స్ ఉన్నారు. కానీ బాలీవుడ్ భామలంత మాత్రం కాదు. అయితే టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి చెక్కేసే హీరోయిన్స్ మాత్రం బాలీవుడ్ లో అడుగుపెట్టగానే గ్లామర్ గేట్స్ ఎత్తెయ్యడానికి ఏమాత్రం వెనకాడరు. అక్కడ అందాలు ఆరబొయ్యకపోతే మనుగడ లేదు కాబట్టి. అదే టాలీవుడ్ లో అయితే చాలావరకు నటనతో, అందంతో నెట్టెయ్యొచ్చు. కానీ బాలీవుడ్ లో అలా కాదు.. అందం అభినయం, గ్లామర్ అన్ని కావాలి. అందుకే అక్కడికెళ్ళేముందు హీరోయిన్స్ అంతా ఫోటో షూట్స్ కి అందాలు ఆరబోసి బికినీ షో చెయ్యడానికి ప్రిపేర్డ్ గా వుంటారు.

ఆమధ్యన టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ బాలీవుడ్ లో ఒకటి రెండు సినిమాల్లో నటించింది. సక్సెస్ అవలేదు అది వేరే సంగతి. కానీ ఆక్కడ జరిగే అవార్డు ఫంక్షన్స్ కి బాలీవుడ్ భామలకు పోటీగా క్లివేజ్ షో తో అదరగొట్టింది. కాజల్ వేసిన ఆ గ్లామర్ గౌన్ చూసిన ఎవరైనా మన చందమామేనా అనిపించక మానదు. మరి ఆ అవార్డు ఫంక్షన్ లో కాజల్ చేసినా గ్లామర్ షో ఇక్కడ టాలీవుడ్ ఫంక్షన్స్ లో చేసినా అంతగా అయితే లేదు. ఇక తాజాగా టాలీవుడ్ అవకాశాలు లేక అల్లాడుతున్న రకుల్ ప్రీత్ కూడా బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది. హాట్ అండ్ క్యూట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ బాలీవుడ్ కి వెళ్ళగానే రెచ్చిపోయి హాట్ హాట్ ఫోటో షూట్స్ చేయించుకుని మరీ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది.

అయితే జీరో సైజు ట్రై చేస్తుందేమో అమ్మడు ఈమధ్యన మరీ పూచిక పుల్లలా తయారైంది. ఇప్పటికే రకుల్ బరువు మీద సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి. ఇక తాజాగా అమ్మడు వోగ్ అవార్డ్స్ లో క్లివేజ్ షో తో అదరగొట్టింది. బాలీవుడ్ భామలు కరీనా కపూర్, జాన్వీ కపూర్, ఇలియానా వంటి భామలతో పోటీ పడిమరీ అందాల ఆరబోతలో తనేం తక్కువ కాదని చూపించింది. మరి నిజంగా వోగ్ అవార్డ్స్ లో రకుల్ ప్రీత్ చేసినా క్లివేజ్ షో మాత్రం ఇదివరకెన్నడూ ఇక్కడ టాలీవుడ్ లో చూడలేదంటే నమ్మాలి. మరి మీరు రకుల్ హాట్ అందాలను తనివి తీరా ఆస్వాదించండి..

Similar News