అది మానేసాక.. అప్పుడప్పుడు ఇబ్బంది పడుతుందట

తెలుగులో టాప్ చైర్ కి దగ్గరయినట్లే అయ్యి.. ప్రస్తుతం ఫెడవుట్ లిస్ట్ లోకెళ్ళిపోయిన రకుల్ ప్రీత్ సింగ్.. ఫిట్నెస్ కోసం బోలెడన్ని జిమ్ ఎక్సరసైజెస్ చేస్తుంది. బాడీ [more]

Update: 2020-02-16 04:00 GMT

తెలుగులో టాప్ చైర్ కి దగ్గరయినట్లే అయ్యి.. ప్రస్తుతం ఫెడవుట్ లిస్ట్ లోకెళ్ళిపోయిన రకుల్ ప్రీత్ సింగ్.. ఫిట్నెస్ కోసం బోలెడన్ని జిమ్ ఎక్సరసైజెస్ చేస్తుంది. బాడీ ని ఫిట్ గా వుంచుకోవడానికి నిరంతరం శ్రమిస్తోంది. ప్రస్తుతం తమిళ, బాలీవుడ్ సినిమాల్తో సరిపెట్టుకుంటున్న రకుల్ ఒక్కప్పుడు మాంసాహారం ప్రియురాలు. మాంసాహారాన్ని ఇష్టం గా తినే రకుల్ ప్రీత్… . శాకాహారం అంటే కూడా ఇష్టపడేదట. అయితే రకుల్ డైట్ లో ఎక్కువు భాగం మాంసాహారం ఉండేదట. అందులోను ఉడికించిన కోడిగుడ్లును ఎక్కువగా తినేదాన్ని అని చెప్పిన రకుల్.. అనుకోకుండా శాకాహారిగా మారిపోయిందట.

శాకాహారిగా మారాలని అనిపించడమే తడువుగా శాకాహారిగా మారిపోయా అని.. ముంబై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతున్నప్ప్పుడు ఇంటి నుండే ఫుడ్ వస్తుంది అని.. అందులో పండ్లు, అన్నం, పప్పు రైస్ తీసుకుని వెళుతుందట రకుల్. ఇక ముంబై మినహా అవుట్ డోర్ షూట్ కి వెళ్ళినప్పుడు అక్కడ మాంసాహారమైన చేపలు, చికెన్ లాంటివి ఎక్కువగా దొరుకుతాయని.. అలాంటాప్పుడు కాస్త ఇబ్బంది పడతా అని.. ఏవైనా కూరగాయలు దొరికితే మాత్రం వాటిలో అన్నం, పప్పు వేసి కిచిడీలాగా చేసి నెయ్యి వేసుకొని తింటానని చెబుతుంది రకుల్.

Tags:    

Similar News