ఫంక్షన్స్ కి పార్టీలకు వెళ్తే ఆఫర్స్ రావు

ఇలా అన్నది ఎవరో కాదు.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఖాళీ అయ్యి, కోలీవుడ్, బాలీవుడ్ సినిమాల్తో నెట్టుకొస్తున్న రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో అవకాశాలు లేని రకుల్ [more]

Update: 2019-11-12 08:54 GMT

ఇలా అన్నది ఎవరో కాదు.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఖాళీ అయ్యి, కోలీవుడ్, బాలీవుడ్ సినిమాల్తో నెట్టుకొస్తున్న రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో అవకాశాలు లేని రకుల్ ప్రీత్ సింగ్ కోలీవుడ్ లో మాత్రం బిజీగా వుంది. అంతేకాకుండా బాలీవుడ్ లోను సినిమాల మీద సినిమాలు చేసే ఈ హాటీ ఈమధ్యన సోషల్ మీడియాలో భీభత్సంగా రెచ్చిపోతుంది. అలాగే బాలీవుడ్ లో ఏ పార్టీ జరిగినా.. ఏ అవార్డు ఫంక్షన్ జరిగినా అక్కడ హాట్ హాట్ డ్రెస్సులతో వాలిపోతున్న రకుల్ ప్రీత్.. అవాకాశాలు కోసం పార్టీలు, ఫంక్షన్స్ పనికిరావని చేబుతుంది.

మాములుగా హీరోయిన్స్ ని పార్టీలకు, అవార్డ్స్ ఫంక్షన్స్ కి పిలిసిస్తే…మంచి డ్రెస్సుల్తో, హాట్ హాట్ గా కనబడుతూ వయ్యారాలు పోతూ నడవడమే కాదు… స్టేజ్ మీద హాటెస్ట్ డాన్స్ లతో అదరగొట్టేస్తారు. అలాగే పార్టీలలో సహా నటులతో మందు చిందు అంటూ రెచ్చిపోతుంటారు. అయితే పార్టీలలో హీరోయిన్స్ దర్శకనిర్మతలను, హీరోలను ఆకర్షించడానికి తహతహలాడుతుంటారు. వారి దృష్టిలో అందంగా, హాట్ గా కనబడితే అవకాశాలు వాటంతట అవే వస్తాయనుకుంటారు. కానీ రకుల్ ప్రీత్ మాత్రం పార్టీలకు ఫంక్షన్స్ కి తిరిగితే అవకాశాలు రావనే ఫిలాసఫీ చెబుతుంది. మరి తానెందుకు బాలీవుడ్ లో పార్టీలకు హాజరవుతుందో ఆమెకే తెలియాలి మరి.

Tags:    

Similar News