మంచు సినిమాలో రకులా.. అదేం లేదే!!

టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ కెరీర్ ఇక ముగిసినట్టే. కానీ ఈ మాటంటే రకుల్ ఎంత మాత్రం ఒప్పుకోదు. ప్రస్తుతం తెలుగులో వైష్ణవ తేజ్ సినిమాలో ఓ [more]

Update: 2020-11-26 05:15 GMT

టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ కెరీర్ ఇక ముగిసినట్టే. కానీ ఈ మాటంటే రకుల్ ఎంత మాత్రం ఒప్పుకోదు. ప్రస్తుతం తెలుగులో వైష్ణవ తేజ్ సినిమాలో ఓ పల్లెటూరి పాత్రలో నటించిన రకుల్ క్రిష్ – పవన్ సినిమాలో నటిస్తుంది అనే టాక్ ఉంది. కానీ అది ఇప్పుడు కాదు అంటున్నారు. ఇకపోతే రకుల్ ప్రీత్ మంచు ఫామిలీ కి కావాల్సిన హీరోయిన్. అంటే మంచు లక్ష్మి కి రకుల్ జిగ్రీ దోస్త్.  ప్రస్తుతం ఆఫర్ లేని రకుల్ మంచు మోహన్ బాబు హీరోగా తెరకెక్కుతున్న స‌న్నాఫ్ ఇండియా లో నటిస్తుంది అనే టాక్ వినిపిస్తుంది. తాజాగా హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలైన స‌న్నాఫ్ ఇండియా లో రకుల్ అనగానే ఆ సినిమాపై అందరిలో ఆసక్తి.

అంతలో నిరాశ అన్నట్టుగా రకుల్ ప్రీత్ ఈ సినిమాలో నటించడం లేదని అటు రకుల్ ప్రీత్ పిఆర్ టీం మాత్రమే కాదు.. ఇటు స‌న్నాఫ్ ఇండియా చిత్ర బృందం స్పష్టం చేసింది. అసలు స‌న్నాఫ్ ఇండియా లో హీరోయిన్ పాత్ర ఉండదని.. సో ఇక రకుల్ ఎలా నటిస్తుంది అని అంటుంటే.. రకుల్ ప్రీత్ చేతిలో రెండు బాలీవుడ్ సినిమాలు, రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. అంతకుమించి రకుల్ ఎలాంటి సినిమాకి సైన్ చెయ్యలేదంటున్నాయి రకుల్ పిఆర్ వర్గాలు.

Tags:    

Similar News