రకుల్ కి మెగా హెల్ప్ అవుతుందా?

కెరటంతో ప్లాప్ కొట్టినా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో హిట్ కొట్టిన రకుల్ ప్రీత్ లైం లైట్ లోకి వచ్చింది. ఆ సినిమాతో మంచి సక్సెస్ ని [more]

Update: 2021-03-11 15:06 GMT

కెరటంతో ప్లాప్ కొట్టినా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో హిట్ కొట్టిన రకుల్ ప్రీత్ లైం లైట్ లోకి వచ్చింది. ఆ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకుంది. కెరీర్ లో నిలదొక్కుకుంది. మరీ ముఖ్యంగా మెగా హీరోల సినిమాలతో తనకి మంచి హిట్స్ వచ్చాయి. బ్రూస్ లీ సినిమా ప్లాప్ అయినా మళ్ళీ రకుల్ ని ఎంకరేజ్ చేసిన రామ్ చరణ్ ధ్రువ సినిమాలో ఛాన్స్ ఇవ్వడమే కాదు.. ఆ సినిమాతో మంచి హిట్ ఇచ్చాడు. అల్లు అర్జున్ సరైనోడు సినిమాతో మంచి హిట్ ఇచ్చాడు.
అలా మెగా హీరోల వలెనే సక్సెస్ బాట పట్టిన రకుల్ కి తర్వాత కంటిన్యూస్ గా స్ట్రోక్స్ తగిలాయి. స్పైడర్ మూవీ, తమిళ్ లో ఎన్ జీకే, నాగ్ తో చేసిన మన్మధుడు 2 ఇలా రెండు మూడు సినిమాలతో స్ట్రోక్స్ తగిలాయి. చివరికి చెక్ సినిమాలోనూ రకుల్ ఇంపార్టెంట్ కేరెక్టర్ ప్లే చేసినా ఆ సినిమా కూడా రకుల్ కి కరెక్ట్ రిజల్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు కొత్తగా ఉప్పెన తో ఉప్పెనలా దూసుకొచ్చిన మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ మూవీలో క్రిష్ దర్శకత్వంలో నటించింది. ఆ సినిమాపైనే రకుల్ హోప్స్ ఉన్నాయి. ఆ సినిమాకి జంగిల్ బుక్ టైటిల్ అనుకుంటున్నారు. ఆ సినిమాపైనే రకుల్ చాలా హోప్స్ పెట్టుకుంది. బాలీవుడ్ లో అయితే రెండు సినిమాలతో బిజీగా వుంది.

Tags:    

Similar News