చాలాకాలానికి కనిపించనున్న రకుల్

‘లై’తో డిజాస్టర్ అందుకున్న నితిన్ హిట్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ‘ఛలో’ లాంటి హిట్ చిత్రాన్ని మనకు అందించిన వెంకీ కుడుములతో ఓ [more]

Update: 2018-12-28 06:17 GMT

‘లై’తో డిజాస్టర్ అందుకున్న నితిన్ హిట్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ‘ఛలో’ లాంటి హిట్ చిత్రాన్ని మనకు అందించిన వెంకీ కుడుములతో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు . కొన్ని నెలల కిందట వెంకీ నితిన్ కు ఒక లైన్ చెబితే వెంటనే ఓకే చేసేశాడని తెలుస్తుంది. అప్పటి నుండి వెంకీ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇది ఇంకా సెట్స్ మీదకు వెళ్లకముందే మరో సినిమాని లైన్ లో పెట్టేసాడు నితిన్.

నితిన్ తో మొదటిసారి

చంద్రశేఖర్ యేలేటితో ఒక సినిమా చేయడానికి నితిన్ ఓకే చెప్పాడట. అయితే ఇందులో తొలిసారిగా నితిన్ సరసన రకుల్ నటించనుందని తెలుస్తుంది. రీసెంట్ గా కథ విన్న రకుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందనేది సమాచారం. ‘స్పైడర్’ తరువాత మళ్లీ తెలుగులో చేస్తున్న సినిమా ఇదే. చాలా కాలంగా రకుల్ తెలుగులో స్టార్ హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తూ వస్తోంది. టాలీవుడ్ లో కొత్త హీరోయిన్స్ రావడంతో ఆమె జోరు తగ్గింది. అందుకే వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ఉపయోగించుకుంటుంది.

Tags:    

Similar News