బుద్దిమంతుడు తెలివైనవాడు భర్తగా కావాలట!!

ఈమాటనున్నది ఎవరో కాదు ప్రస్తుతం అవకాశాలు లేని రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో అవకాశాలు నిల్. తమిళనాట ఒకటో అరా, బాలీవుడ్ లోను అంతే. అయితే తాజాగా [more]

Update: 2020-05-14 08:53 GMT

ఈమాటనున్నది ఎవరో కాదు ప్రస్తుతం అవకాశాలు లేని రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో అవకాశాలు నిల్. తమిళనాట ఒకటో అరా, బాలీవుడ్ లోను అంతే. అయితే తాజాగా కరోనా లక్డౌన్ తో ఇంట్లోనే ఉంటున్న రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టీవ్ గా ఉంటుంది. ఇంట్లోనే జిమ్ చేయడం, తమ్ముడు అమన్ తో ఆడుకోవడం చేస్తున్న రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో లక్ష్మి మంచు చేస్తున్న ఇంటర్వ్యూలో పార్ట్ అయ్యింది. మంచు లక్ష్మి కరోనా లక్డౌన్ కారణముగా ఫన్ కోసం సెలెబ్రిటీస్ ని సోషల్ మీడియాలో ఇంటర్వూస్ చేస్తుంది. అందులో భాగంగా లక్ష్మి మంచు రకుల్ ని ఇంటర్వ్యూ చేసింది.

అందులో భాగంగా ఎలాంటి వరుడు కావాలనుకుంటున్నావ్ రకుల్ అని అడగగా.. దానికి రకుల్ ఒకప్పుడు కాబోయే భర్తకుండాల్సిన క్వాలిటీస్ చాంతాడంత లిస్ట్ ఉండేదని.. కానీ ఇప్పుడు మాత్రం బుద్దిమంతుడు, తెలివితేటలున్న అబ్బాయి అయితే చాలని చెబుతుంది. ఇక తన పనిని ఎంకరేజ్ చేసేవాడైతే మరి మంచిది అని.. అందంగా ఉండాల్సిన పని లేదని.. తెలివితేటలతో జీవితాన్ని ముందుకు నడిపించగల సామర్థ్యం ఉన్నవాడు అయితే చాలని తనకి కాబోయే వరుడు ఇలా ఉండాలని చెప్పింది రకుల్ 

Tags:    

Similar News