ఇప్పటికే అర కొర.. ఇక ఇప్పుడు మొత్తం నిల్!!

ప్రస్తుతం రకుల్ ప్రీత్ కెరీర్ ఏమంత గొప్పగా లేదు. తెలుగు, తమిళ, బాలీవుడ్ లలో అరకొర అవకాశాలతో రకుల్ కెరీర్ కొనసాగుతుంది. రకుల్ ప్రీత్ ఒకప్పుడు స్టార్ [more]

Update: 2020-09-13 06:39 GMT

ప్రస్తుతం రకుల్ ప్రీత్ కెరీర్ ఏమంత గొప్పగా లేదు. తెలుగు, తమిళ, బాలీవుడ్ లలో అరకొర అవకాశాలతో రకుల్ కెరీర్ కొనసాగుతుంది. రకుల్ ప్రీత్ ఒకప్పుడు స్టార్ హీరోస్ అందరితో పని చేసింది. కానీ కెరీర్ లో గొప్పగా మిగిలి పోయిన సినిమా లేదు. అలాగే రకుల్ నటించిన సినిమాలు వరసగా ప్లాప్ అవడంతో రకుల్ ని పట్టించుకోవడం మానేశారు. తెలుగులో క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ తేజ్ సరసన ఓ డీ గ్లామర్ రోల్ చేస్తున్న రకుల్..ఆ సినిమా కోసం చాలా తక్కువ రోజుల డేట్స్ కేటాయించింది. రకుల్ బిజీ అని కాదు.. క్రిష్ సినిమా చిన్న సినిమా కావడమే. ఇక తమిళ్ లో భారతీయుడు 2 లో నటిస్తున్న రకుల్ కి షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీ లేదు. ఇకబాలీవుడ్ లో అర్జున్ కపూర్ తో ఓ సినిమా, నితిన్ చందు మొండెడితో మరో సినీమా చెయ్యాల్సి ఉంది.

మరి అవకాశాలు రాని టైం లో రకుల్ మెడకి డ్రగ్స్ కేసు చుట్టుకుంది. అంటే అసలే అరకొర అవకాశాలతో ఉన్న రకుల్ ని ఇక ఏ దర్శకనిర్మాతలు తమ సినిమాల్లో తీసుకోరు. తాజాగా బాలీవుడ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రియా చక్రవర్తి రకుల్ పేరు బయటపెట్టడంతో.. రకుల్ మెడకి డ్రగ్స్ కేసు చుట్టుకుంది. అయితే నిన్న రకుల్ పేరు తెరమీదకి రాగానే రకుల్.. క్రిష్ సినిమా షూటింగ్ నుండి అర్ధాంతరంగా వెళ్ళిపోయింది అని.. మీడియాకి మొహం చాటేసింది అనే టాక్ నడిచింది. అలాగే రకుల్ డ్రగ్స్ తీసుకోలేదని.. ఈ కేసుకి రకుల్ కి సంబంధం లేదని ఆమె మేనేజర్ చెబుతున్నప్పటికీ.. ఎన్సీబీ అధికారులు రకుల్ ని విచారించడానికి రేడి అవుతున్నట్టుగా సమాచారం. 

ఒకవేళ డ్రగ్స్ తీసుకున్నట్టుగా నిరూపితమైతే ఇక రకుల్ ప్రీత్ కెరీర్ ముగిసినట్టే అంటున్నారు. సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో అందచందాలతో ఫొటోస్ కి ఫోజులిస్తూ యోగాసనాలు, జిమ్ చేస్తూ మరీ సన్నగా తయారైన రకుల్.. ఈ విషయంలో ఎప్పుడూ హాట్ టాపిక్కే. ఇప్పుడు సినిమాల విషయం కన్నా ఎక్కువగా ఈ డ్రగ్స్ కేసులో మీడియాలో రకుల్ పేరు విపరీతంగా పాపుల్లర్ అయ్యింది. ఒకవేళ విచారణ ఎదుర్కొంటే.. రకుల్ మరింతగా డ్రగ్ ఊబిలో చిక్కుకున్నట్టే.

Tags:    

Similar News