రష్మిక వలన జీవిత పాఠాన్ని నేర్చుకున్న హీరో?

కన్నడ నుండి తెలుగులోకి అడుగుపెట్టి. సక్సె ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మిక మందన్న ప్రేమ, బ్రేకప్ విషయాలు ఆమెని ఇంకా కెలుకుతూనే ఉన్నాయి. కారణం ఆమె [more]

Update: 2019-12-29 14:55 GMT

కన్నడ నుండి తెలుగులోకి అడుగుపెట్టి. సక్సె ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మిక మందన్న ప్రేమ, బ్రేకప్ విషయాలు ఆమెని ఇంకా కెలుకుతూనే ఉన్నాయి. కారణం ఆమె మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి.. ప్రేమ, బ్రేకప్ విషయాలను వదిలేసి తన పని తాను చేసుకుంటున్న రష్మిక ని బ్రేకప్ విషయంలో కెలుకుతోనే ఉన్నాడు.. రక్షిత్ తాజాగా మాట్లాడుతున్న మాటలకూ ఆమె హార్ట్ అయ్యిందో లేదో కానీ…. ఆమె కూడా ఆ బ్రేకప్ విషయాలకు స్పందించాల్సిన పరిస్థితి. కెరీర్ కోసం ఎంగేజ్మెంట్ ని రద్దు చేసుకుంది.. ఆమె పనిని ఆమెని చేసుకోనివ్వండి అంటున్న రక్షిత్ శెట్టి కి రష్మిక మందన్న కూడా కూల్ గా కౌంటర్ ఇస్తుంది.. సినిమాల్లోకి రాగానే ప్రేమ, పెళ్లి అంటూ దిగిపోవడం, తర్వాత కెరీర్ లో బిజీ అవడంతో పెళ్లి ఆపెయ్యాల్సి వచ్చింది అని చెబుతుంది రష్మిక.

ఇక రక్షిత్ శెట్టి శ్రీమన్నారాయణ ఇంటర్వూస్ లో రష్మిక మేటర్ పదే పదే తెచ్చి.. సినిమాని ప్రమోట్ చేసుకుంటూ.. మరోసారి రష్మిక విషయం మాట్లాడాడు. రష్మిక తో ప్రేమ, ఎంగేజ్మెంట్ తో జీవిత పాఠాన్ని నేర్చుకున్నా అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. జీవిత పాటలు నేర్పడానికి.. ఒకరి లైఫ్ లోకి ఒకరు వస్తుంటారని.. అలా రష్మిక నా లైఫ్ లోకి రావడం వల్లే నేను జీవిత పాటలు నేర్చుకున్న అంటున్నాడు. ఇక తన వల్ల కూడా రష్మిక మందన్న జీవిత పాఠాన్ని నేర్చుకునే ఉంటుంది.. మనకు తెలియని మనుషులతో స్నేహం, ప్రేమ పుట్టినప్పుడు మనకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకుంటామని చెప్పిన రక్షిత్ శెట్టికి మీడియా మిత్రుడొకడు.. తిరిగి రష్మిక మల్లి మీ లైఫ్ లోకి వస్తే.. ఆమెని యాక్సెప్ట్ చేస్తారా అన్న ప్రశ్నకు.. అది నా పర్సనల్ విషయం అంటూ రక్షిత్ సమాధానం

Tags:    

Similar News