రకుల్ అందం అద్వితీయమే

Update: 2018-09-13 06:37 GMT

రకుల్ ఈ మధ్యన తెలుగు సినిమాల్లో ఇదివరకటిలా కనబడడం లేదు. స్పైడర్ దెబ్బతో రకుల్ ప్రీత్ సింగ్ కి టాలీవుడ్ అవకాశాలు సన్నగిల్లాయి. కానీ ఆ విషయం రకుల్ మాత్రం ఒప్పుకుంటేకదా... తనకి తెలుగులో అవకాశాలు లేవని ఎవరు చెప్పారు.. తమిళంలోనూ, బాలీవుడ్ లోను ఉన్న సినిమాల్తో కాస్త బిజీగా ఉండి తెలుగులో నటించడం లేదంటూ గడుసుగా సమాధానం చెబుతుంది. అలాగే ఎన్టీఆర్ బయో పిక్ లో శ్రీదేవి పాత్రకి తనని సంప్రదించారని చెప్పిన రకుల్ ప్రీత్ ఇంకా ఆ సినిమాలో తాను నటిస్తున్నట్టుగా సైన్ చెయ్యలేదని చెబుతుంది. ఇక రకుల్ ప్రీత్ కి పర్సనల్ స్టయిలిస్ట్ అయిన నీరజ కోన రకుల్ అటెండ్ అయ్యే ఈవెంట్స్ కి స్టయిలిష్ట్ గా పనిచేయడమే కాదు.. ఆ ఈవెంట్ కి హాజరయ్యే ముందు రకుల్ ఫోటో షూట్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. రీసెంట్ గా అందమైన వైట్ డ్రెస్సులో అదరగొట్టిన రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో షూట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

బాలీవుడ్ కి వెళ్ళాక మాక్సిమ్ మ్యాగజైన్ కోసం అదిరిపోయే ఫోజులతో ఫోటో షూట్ చేయించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా బాలీవుడ్ ఫోటో గ్రాఫర్ నిర్వహించిన ఫోటోషూట్ లో పాల్గొంది. ఇక ఆ ఆఫొటో షూట్ లో బ్లాక్ నెటెడ్ డ్రెస్సులో అదిరిపోయే ఫోజులో అందరి గుండెలని పిండేస్తుంది. జుట్టు మొత్తం వదిలేసి పిచ్చెక్కించే చూపుతో అందాలు కనిపించికనిపించనట్టుగా మేనేజ్ చేస్తూ రకుల్ ప్రీత్ అందాలతో, గ్లామర్ తో అలరిస్తుంది. మరి అందం ఆకర్షణ అన్ని రకుల్ సొంతమే. హొయలుపోయే నడుంఒంపులతో.. అదిరిపోయే ఫిట్నెస్ తో అదరగొట్టేస్తున్న రకుల్ మీద టాలీవుడ్ స్టార్ హీరోల దృష్టి పడుతుందేమో చూడాలి.

ఒకపుడు స్టార్ హీరోలందరిని చుట్టిసిన రకుల్ ఇప్పుడు తమిళంవైపు, బాలీవుడ్ వైపు వెళ్లాల్సి వచ్చింది. మహేష్ తో చేసిన స్పైడర్ సినిమాలో రకుల్ లుక్స్ గాని... ఆమె చేసిన జిరో సైజు ఫిట్నెస్ గాని.... రకుల్ నటన గాని.. ఏమి ఆమెకు హెల్ప్ కాకపోగా.. టాలీవుడ్ హీరోల పక్కన అసలు ఛాన్స్ అనేదే లేదు. ఒకప్పుడు టాలీవుడ్ లో బిజీ తారగా ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు అడపాదడపా టాలీవుడ్ కి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇకపోతే రకుల్ కి తెలుగులో సినిమాలేమి లేకపోయినా తమిళంలో హిందీ లో అగ్ర హీరోలతో నటిస్తూ బిజీగానే ఉంది.

Similar News