రకుల్ కు కోపమొచ్చిందండోయ్

Update: 2018-11-19 05:20 GMT

‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ లాంటి చిన్న సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయినా రకుల్ ప్రీత్ సింగ్ చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. టాలీవుడ్ లో దాదాపు అందరి హీరోలతో నటించిన ఆమెకు 'స్పైడర్' డిజాస్టర్ అవ్వడంతో ఇక్కడ సినిమాలు చేయడం మానేసింది. బాలీవుడ్ లో.. కోలీవుడ్ లో సినిమాల పై ఫోకస్ పెట్టిన రకుల్ కు సోషల్ మీడియా లో ప్రతిసారీ తెలుగులో ఛాన్సుల్లేకపోవడం గురించే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దాంతో ఆమె అసహనానికి గురై ఇలా సమాధానం ఇచ్చింది.

తనకు లైఫ్ ఇచ్చింది టాలీవుడే అని..అనుకోకుండా తెలుగులో గ్యాప్ వచ్చిందని..అంతే కానీ నా పని అయిపోయింది అని ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అని అంది. ప్రస్తుతం తను ఇతర భాషల్లో దాదాపు 7 సినిమాలు చేస్తున్నానని... వాటిని ఫినిష్ చేసే పనిలో ఉండటంతో తెలుగు మీద పెద్దగా ఫోకస్ చేయడంలేదని చెప్పింది. ఏడాదికి 365 రోజులే ఉంటాయని.. అంతకుమించి ఆశించలేమని.. ఎవ్వరైనా ఎంత కష్టపడగలరని ఆమె ప్రశ్నించింది.

తాను తీరిక లేకుండా సినిమాలు మీద సినిమాలు చేస్తున్నానని...తెలుగులో మళ్లీ సినిమాలు చేస్తానని క్లారిటీ ఇచ్చింది. ఇతర భాషల్లో ఎన్ని సినిమాలు చేసిన తెలుగుకే తన తొలి ప్రాధాన్యం అని రకుల్ స్పష్టం చేసింది. రీసెంట్ గా ఈమె 'ఎన్టీఆర్' బయోపిక్ లో శ్రీదేవి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

Similar News