సినిమాలు లేకపోతేనేమి.. కాస్ట్లీ ఇల్లుకొంది?

తెలుగులో సినిమాల్లేవ్, తమిళంలో ఓ సినిమా ఉంది. కానీ బాలీవుడ్ లో మాత్రం అడపాదప అవకాశాలు వస్తున్నాయ్. అక్కడ హిట్ కొట్టలేకయినా… అక్కడే వేలాడుతున్న రకుల్ ప్రీత్ [more]

Update: 2019-11-23 12:57 GMT

తెలుగులో సినిమాల్లేవ్, తమిళంలో ఓ సినిమా ఉంది. కానీ బాలీవుడ్ లో మాత్రం అడపాదప అవకాశాలు వస్తున్నాయ్. అక్కడ హిట్ కొట్టలేకయినా… అక్కడే వేలాడుతున్న రకుల్ ప్రీత్ కి వ్యాపారంలో కూడా మంచి ఆదాయమే వస్తుంది. టాలీవుడ్ లో హైదరాబాద్, వైజాగ్ వంటి ప్రాంతాల్లో జిమ్ సెంటర్స్ ని ఏర్పాటు చేసి వ్యాపార పరంగాను దూసుకుపోతున్న రకుల్ కి హైదరాబాద్ లో చక్కటి ఇల్లు ఉంది. అన్ని వసతులతో రకుల్ స్పెషల్ గా కట్టించుకున్న హైదరాబాద్ ఇల్లు తో పాటుగా ఇపుడు మరోచోట ఓ కాస్ట్లీ ఇల్లు కొనుకుందట.

అది బెంగుళూరు మహానగరంలో ఓ మంచి పేరున్న ఏరియా లో రకుల్ ప్రీత్ ఆరు కోట్ల రూపాయలతో ఓ ప్లాట్ కొనుకుందట. అత్యంత ఖరీదైన ప్లేస్ లో రకుల్ ప్రీత్ ఓ ఫ్లాట్ కొనుకున్నదని, అందులో అన్ని వసతులు ఉన్నాయని అంటున్నారు. అయితే రకుల్ ప్రీత్ కి బెంగుళూరులో మంచి స్నేహితులు ఉండడంతో పాటుగా.. అక్కడ కూడా జిమ్ బిజినెస్ ని మొదలెట్టాలనే ఆలోచన ఉండబట్టే అక్కడ అంత కాస్ట్లీ ఇల్లు కొందంట. మరి వ్యాపారం అంటే అడపాదడప వెళ్ళాలి. వెళ్ళినప్పుడు హోటల్ కి బోలెడంత ఖర్చు. అదే ఇల్లుంటే.. అబ్బా రకుల్ ఆలోచనే సూపర్ కదా.

Tags:    

Similar News