మొత్తానికి బయటపడిన ఓం కార్

గత శుక్రవారం విడుదలైన రాజుగారి గది 3 సినిమాకి ప్రేక్షకులనుంచి క్రిటిక్స్ నుంచి కూడా ప్లాప్ టాక్ వచ్చింది. సినిమాలో వెకిలి కామెడీని తట్టుకోవడం కష్టంగా ఉందని [more]

Update: 2019-10-22 09:03 GMT

గత శుక్రవారం విడుదలైన రాజుగారి గది 3 సినిమాకి ప్రేక్షకులనుంచి క్రిటిక్స్ నుంచి కూడా ప్లాప్ టాక్ వచ్చింది. సినిమాలో వెకిలి కామెడీని తట్టుకోవడం కష్టంగా ఉందని ముక్త కంఠంతో అన్నారు. కాకపోతే సైరా సినిమా తర్వాత సినిమాలేవీ సరిగ్గా లేకపోవడంతో రాజుగారి గది సేఫ్ అయ్యేలా కనబడుతుంది. అందులో లో బడ్జెట్ తో తెరకెక్కడం, థియేట్రికల్ రైట్స్ కూడా తక్కువకే అమ్మడంతో రాజుగారి గది సినిమాకి వీర లెవల్లో లాభాలు రాకపోయినా నష్టాలైతే రావు. బయ్యర్లు సేఫ్ అయ్యి చిన్నపాటి లాభాలు కొట్టినా కొట్టొచ్చు. మొదటి రోజు డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన రాజుగారి గది 3 ఫస్ట్ వీకెండ్ లో 3 కోట్ల 50 లక్షల రూపాయల షేర్ సాధించింది.

సేఫ్ అయ్యారు….

ఇక సోమవారం రాజుగారి గది థియేటర్ల దగ్గర ప్రేక్షకులు పల్చగా కనబడడంతో సినిమాకు లాభాలు రాకపోయినా నష్టాలూ తప్పుతాయనిపించింది. ఎందుకంటే రాజుగారి గది థియేట్రికల్ రైట్స్ ని కేవలం 3 కోట్ల 75 లక్షలకే అమ్మడంతో ఈ సినిమా ఫస్ట్ వీక్ పూర్తి చేసుకునేలోపు అనేకన్నా నిన్న,ఈ రోజు కలిపితే బ్రేక్ ఈవెన్ కొట్టొచ్చని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. సినిమాకి ప్లాప్ టాక్ వచ్చినా మాస్ ఆడియన్స్ ని మెప్పించిందని సినిమా బి.సి సెంటర్స్ కి కనెక్ట్ కావడంతోనే మంచి కలెక్షన్స్ వస్తున్నాయని అంటున్నారు. తక్కువ బడ్జెట్ గనక ప్లాప్ టాక్ వచ్చినా నిర్మాతలు సేఫ్ అవడంతో ఓం కార్ కూడా బయటపడినట్లే అంటున్నారు.

 

 

Tags:    

Similar News