ఇప్పుడు వెంకి ఒప్పుకోవాలిగా?

నిన్న శుక్రవారం విడుదలైన రాజుగారి గది 3 సినిమా కి మిక్స్డ్ కాదుకానీ.. ప్లాప్ టాక్ పడిందనే చెప్పాలి. దర్శకుడు ఓం కార్ రాజుగారి గది సీక్వెల్ [more]

Update: 2019-10-19 07:24 GMT

నిన్న శుక్రవారం విడుదలైన రాజుగారి గది 3 సినిమా కి మిక్స్డ్ కాదుకానీ.. ప్లాప్ టాక్ పడిందనే చెప్పాలి. దర్శకుడు ఓం కార్ రాజుగారి గది సీక్వెల్ తో దర్శకుడిగా దూసుకుపోతున్నాడు. రాజుగారి గది సినిమాని పూర్తి కామెడీతో తీసిన ఓంకార్ రాజుగారి గది 2 ని నాగార్జున, సమంత లాంటి పెద్ద స్టార్స్ తో ఎమోషనల్ డ్రామాగా నడిపించాడు. కానీ రాజుగారి గది 3 ని మాత్రం హర్రర్ కామెడీగా చూపిద్దామనుకున్నాడు. కానీ ఆ హర్రర్ కామెడీని ప్రేక్షకులు తట్టుకోలేకపోయారు. రాజుగారి గది సినిమా చూసి 2 కి నాగార్జున, సమంత సైన్ చేశారు. ఇక రాజుగారి గది 2 కేవలం నాగార్జున, సమంత లనే చూసి కాస్తో కూస్తో ఆడింది కానీ… ఆ సినిమా ప్లాప్ అవ్వాల్సింది.

ఇక రాజుగారి గది 3 లో అశ్విన్ ని హీరో చేసేద్దామనుకున్నాడు. మాస్ హీరోగా చూపించేదామనుకున్నాడు. కానీ ఓం కార్ ఎత్తుగడ రివర్స్ అయ్యింది. అశ్విన్ ని హీరోగా కన్నా కామెడీ గ్యాంగ్ లో చూడడమే బావుంది. అసలు న‌వ్వుల్ని పంచే ధ్యాస‌లో ప‌డిపోయిన ఓం కార్ .. అక్క‌డ‌క్క‌డ కాస్త ఓవ‌ర్ చేశాడు. ఎక్క‌డి నుంచి తెచ్చాడో గానీ, దెయ్యాల్ని కూడా మ‌రీ కామెడీ ఫేసులుగా చూపించాడు. దాంతో భ‌యం అనే ఎలిమెంట్ పూర్తిగా మాయ‌మైపోయింది. మరి ఇదంతా చూసాక వెంకటేష్ రాజుగారి గది సీక్వెల్ 4 లో నటించడానికి ముందుకొస్తాడంటే పెద్ద అనుమానపడాల్సిందే. ఎందుకంటే ఓం కార్ రాజుగారి గది సీక్వెల్ లో వెంకీ ని నటింప చెయ్యాలనుకున్నాడట. తన తదుపరి సినిమా లో వెంకీ నే హీరో అంటూ ప్రమోషన్స్ లో ఊదరగొట్టాడు

Tags:    

Similar News