రాజ్ తరుణ్ ది కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా?

రాజ్ తరుణ్ కి వరస ప్లాప్ లే తప్ప హిట్ అన్నదే పడడం లేదు. ఒరేయ్ బుజ్జిగా అయినా హిట్ అవుతుంది అనుకుంటే.. అది లెక్క తప్పింది. [more]

Update: 2020-10-07 05:14 GMT

రాజ్ తరుణ్ కి వరస ప్లాప్ లే తప్ప హిట్ అన్నదే పడడం లేదు. ఒరేయ్ బుజ్జిగా అయినా హిట్ అవుతుంది అనుకుంటే.. అది లెక్క తప్పింది. ఒరేయ్ బుజ్జిగా సినిమా తో హిట్ కొట్టేస్తానని రాజ్ తరుణ్ బాగా నమ్మినట్టుగా ఉన్నాడు. అందుకే ఓటిటికి అమ్మకుండా దర్శకనిర్మాతలకు అడ్డం పడ్డాడని టాక్ ఉంది. కానీ నిర్మాత కి నష్టాలొచ్చేలా ఉన్నాయని ఆయన ఒరేయ్ బుజ్జిగాని ఓటిటికి అమ్మేశాడు. నిర్మాత నిజంగా అక్కడ సేఫ్ అయ్యాడు. ఓటిటికి అమ్మెయ్యడంతో నిర్మాతకి సినిమా ప్లాప్ తో సంబంధం లేదు. అదే థియేటర్స్ లో ఒరేయ్ బుజ్జిగా విడుదలైనట్లయితే బయ్యర్లు బోరుమనే వారు. ఎందుకంటే ఒరేయ్ బుజ్జిగా అంత దారుణంగా ఉంది.

అయితే రాజ్ తరుణ్ కి ఒరేయ్ బుజ్జిగా మీద ఎంత నమ్మకం అంటే ఒకవేళ ఒరేయ్ బుజ్జిగా సినిమా హిట్ అయితే దర్శకుడు విజయ్ కుమార్ కొండా ఎక్కడ తనకి దొరక్కుండా స్టార్ హీరోలు పట్టుకుపోతారనుకున్నాడు. అందుకే విజయ్ కుమార్ కొండా తో తన తదుపరి సినిమాని విజయ్ కుమార్ కొండకి కమిట్ అవడమే కాదు.. ఆఘమేఘాల మీద కొత్త సినిమాని మొదలెట్టేసాడు. విజయ్ కుమార్ కొండా ఎలాగైనా ఒరేయ్ బుజ్జిగాడితో తనకి హిట్ ఇస్తాడు. అందుకే తర్వాత కూడా విజయ్ కుమర్ తోనే అన్నట్టుగా రాజ్ తరుణ్ ఓవర్ కాన్ఫిడెన్స్ కి పోయాడు. కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ.. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండడం కరెక్ట్ కాదు. ఈ విషయం రాజ్ తరుణ్ కి ఈపాటికే అర్ధమై ఉంటుందిలే.

Tags:    

Similar News