ఎన్నికల కోసం సినిమాల హడావిడా…?

కోలీవుడ్ లో యంగ్ హీరోలు కూడా ఏడాదికి ఒక సినిమా చొప్పున నటిస్తుంటే…. సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం ఈ వయసులోనూ వరసబెట్టి సినిమాలు చేస్తూ రెచ్చిపోతున్నాడు. [more]

Update: 2019-04-12 03:20 GMT

కోలీవుడ్ లో యంగ్ హీరోలు కూడా ఏడాదికి ఒక సినిమా చొప్పున నటిస్తుంటే…. సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం ఈ వయసులోనూ వరసబెట్టి సినిమాలు చేస్తూ రెచ్చిపోతున్నాడు. మరోపక్క రాజకీయపార్టీని స్థాపించాడు. అయితే రాజకీయ పార్టీ పెట్టాక రాజకీయాలతో బిజీ అవుతాడనుకున్న సూపర్ స్టార్ ఇపుడు సినిమాల మీద సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీనిస్తున్నాడు. నిన్నగాక మొన్న పెటా తో ప్రేక్షకులముందుకు వచ్చిన రజినీకాంత్.. తాజాగా మురుగదాస్ డైరెక్షన్ లో దర్బార్ సినిమాని మొదలెట్టేసాడు. ఆ సినిమా ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ ని కూడా మొదలెట్టేసుకుంది.

ఇక తాజాగా సూపర్ స్టార్ మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అందులో ఒకటి కోలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కె ఎస్ రవికుమార్ తోను…. అలాగే మరో సినిమాని యంగ్ డైరెక్టర్ వినోత్ కి కమిట్ అయినట్లుగా వార్తలోస్తున్నాయి. 2021 తమినాడు అసెంబ్లీ ఎన్నికల టైం కల్లా ఎన్ని సినిమాలు వీలయితే అన్ని సినిమాలు చేసేసి.. ఆతర్వాత తమిళనాడులో జరిగే ఎన్నికల టైం కి తన పార్టీని బరిలోకి దింపే ఆలోచనలో రజిని ఉండబట్టే ఇలా సినిమాల మీద సినిమాలు చేసేస్తున్నాడంటున్నారు.

Tags:    

Similar News