పేట ట్రైలర్: కాళీ కుమ్మేసాడు

సూపర్ స్టార్ రజినీకాంత్ 2.0 తర్వాత చాలా తక్కువ టైం లో మరో సినిమాని విడుదలకు సిద్ధం చేసేసాడు. 2.0 తో బాగా లెట్ చేసి అభిమానులను [more]

Update: 2019-01-02 07:31 GMT

సూపర్ స్టార్ రజినీకాంత్ 2.0 తర్వాత చాలా తక్కువ టైం లో మరో సినిమాని విడుదలకు సిద్ధం చేసేసాడు. 2.0 తో బాగా లెట్ చేసి అభిమానులను ఎదురు చూసేలా చేసిన రజిని ఇప్పుడు అభిమానులకు మరో పది రోజుల్లో అదిరిపోయే ట్రీట్ సిద్ధం చేసేసాడు. సంక్రాతి కానుకగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజిని పేట సినిమా ని ఆఘమేఘాల మీద పూర్తి చేసి తెలుగు తమిళంలో ఒకేరోజు విడుదల చెయ్యబోతున్నాడు. టీజర్ తో లుక్స్ తో భారీ అంచనాలను క్రీయాట్ చేసిన పేట ఇప్పుడు ట్రైలర్ తోనూ అదరగొడుతుంది. రజినీకాంత్ మీదున్న అంచనాలు రెట్టింపయ్యేలా.. ఈ సంక్రాంతికి తెలుగులో విడుదలవుతున్న భారీ బడ్జెట్ మూవీస్ కి దడ పుట్టించేలా పేట ట్రైలర్ ని కట్ చేసి వదిలింది చిత్ర బృందం.

కాళిగా, హాస్టల్ వార్డెన్ గా చాలా స్టైలిష్ లుక్ లో రజినీకాంత్ సిమ్రాన్ అండ్ త్రిష లతో కలిసి ఈ సినిమాలో నటించాడు. అసలు రజిని ఏజ్ కి లుక్ కి స్టయిల్ కి ఎటువంటి సంబంధం లేదు. అంత అల్ట్రా స్టైలిష్ గా రజిని కనబడుతున్నాడు. ఇక ట్రైలర్ లో 20 మందిని పంపించాను, అందరినీ చితక్కొట్టి పంపించాడు… అన్న డైలాగు, వీడు మామూలోడు కాదు మహీ అన్న డైలాగు, హహాహా… చూస్తావుగా ఈ కాళీ ఆడించే ఆట అంటూ రజిని చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక తనని చిన్న పిల్లాడిలా ఉన్నావన్న కాలేజ్ అమ్మయితో. స్టయిల్ గా ఉన్నానంట… నాచురల్లీ అంటూ రజినీకాంత్ వయ్యారాలు పోతూ స్టైలిష్ గా చెప్పిన డైలాగ్ అదుర్స్ అనే రేంజ్ లో కొత్తగా ఉన్నాయి.

ఇక విజయ్ సేతుపతి కూడా డిఫ్రెంట్ గా కనబడుతుంటే… నవాజుద్దీన్ సిద్ధిక్ విలన్ లుక్ లో కాస్త మాస్ గా కనిపిస్తున్నాడు. ఇక రజినీకాంత్ నవాజుద్దీన్ సిద్ధిక్ ని నిజం చెబుతున్నాను… కొట్టి అండర్ వేర్ తో పరిగెత్తిస్తాను. పరువు పోతే మళ్లీ తిరిగి రాదు చూస్కో చెప్పే డైలాగ్ చాలా బావుంది. ఇక హీరోయిన్స్ లో సిమ్రాన్ ని మోడరన్ లుక్ లో చూపిస్తే.. త్రిషని ట్రెడిషనల్ లుక్ లో పరిచయం చేసాడు దర్శకుడు. ఇక ట్రైలర్ లో చివరిగా ఇప్పుడు మనమేం చేయబోతున్నాం అని ఒకరు అడగగా.. స్వీట్ తినబోతున్నాం అని రజిని చెప్పిన దాన్ని బట్టి ఈ సంక్రాంతికి అభిమానులకు నిజంగానే సూపర్ హిట్ కొట్టి స్వీట్ తినిపించేలా కనబడుతున్నాడు రజిని. ఇక సినిమాకి సినిమాటోగ్రఫీ హైలెట్ గా నిలవగా… అనిరుద్ రవిచందర్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బావుంది. మరి ఈ సంకాంతికి కాళీ అదరగొట్టేలాగే కనబడుతున్నాడు.. తెలుగు సినిమాలు జాగ్రత్త సుమీ.

Tags:    

Similar News