ఆ రూమర్ పై రజినీ స్పందించారు..!

Update: 2018-12-01 10:05 GMT

తమిళ ఇండస్ట్రీకి రజినీకాంత్ - కమల్ హాసన్ ఇద్దరు రెండు కళ్ల వంటి వారు. ఎవరికి వారికి సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇద్దరి ఫ్యాన్స్ కూడా ఇద్దరి సినిమాలు వచ్చినప్పుడు ఒక్కరిని ఒక్కరు సపోర్ట్ చేసుకుంటారు. కోలీవుడ్ లో ప్రస్తుతం టాప్ సీనియర్ హీరోస్ గా ఉన్న వీరిద్దరి మధ్య గత కొన్ని రోజుల నుండి మనస్పర్థలు వచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇద్దరు వేర్వేరు పార్టీలు పెట్టడంతో ఈ రూమర్ హల్ చల్ చేస్తుంది. అయితే లేటెస్ట్ ఇంటర్వ్యూలో రజినీకాంత్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

గొడవలు పెట్టడానికి ట్రై చేశారు...

ఆ ఇంటర్వ్యూలో రజినీ మాట్లాడుతూ..."నాకు, కమల్ కి మధ్య ఎటువంటి విభేదాలు లేవు...ఎటువంటి గొడవలు లేవు. ఇద్దరం మంచి స్నేహితులం. కమల్ కు నాకు మధ్య పోటీ అనే విషయాన్ని కూడా నేను అంగీకరించను. ఇద్దరం కలిసి ఒకేసారి కెరీర్ ను స్టార్ట్ చేసాం. నేను నా కెరీర్ స్టార్టింగ్ లో డైలాగ్స్ ఎలా చెప్పాలనేది ఆయన దగ్గర నుండే నేర్చుకున్నాను" అని చెప్పారు. "మేమిద్దరు ఎదుగుతూ వస్తుండంతో మా మధ్య గొడవలు పెట్టడానికి చాలామంది ట్రై చేసారు కానీ మేము జాగ్రత్తగా ఉండడంతో అవతలి వారికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. దాంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు" అని చెప్పుకొచ్చారు.

Similar News