రజినీతో పనిచేయడం ఇంతా సింపులా..?

Update: 2018-06-01 08:36 GMT

రజిని మరోసారి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో మనల్ని అలరించడానికి ‘కాలా'గా ఈ నెల జూన్ 7న రానున్నాడు. ఇందులో రజినీకి ప్రియురాలిగా నటిస్తున్న హ్యూమఖురేషి తొలిసారిగా సౌత్ ఫిల్మ్ ఇండ్రస్టీలోకి ఎంట్రీ ఇస్తోంది. జరీనా పాత్ర చేస్తున్న ఆమె మనల్ని కంటతడి పెట్టిస్తుందని చెబుతుంది.

చాలా విషయాలు నేర్చుకున్నా..

ఇక రజినీకి భార్యగా ఈశ్వరీరావు నటిస్తోంది. గ్యాంగ్‌స్టర్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ టైంలో రజినీకాంత్‌ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని తెలిపింది. రజినీతో వర్క్ చేయడం సింపుల్ అంటూనే, తనతోటి నటీనటులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా చూసుకుంటారని చెబుతుంది.రజిని గారు క్రమశిక్షణతో మెలుగుతారని, స్టార్‌డమ్‌ని అసలు పట్టించుకోరని తెలిపింది. ఆయనతో ఒక్కసారి మాట్లాడితే భయం అన్నది తెలీదని లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రజినిపై తన మనసులో అభిప్రాయాలూ చెప్పింది.

Similar News