రాజశేఖర్ ఇరుకున పడతాడా… పెడతాడా?

సీనియర్ హీరో రాజశేఖర్ గత కొంతకాలంగా హిట్ అనే పదానికి మొహం వాచిపోయాడు. కానీ అనూహ్యంగా పిఎస్వీ గరుడ వేగా సినిమాతో మల్లి క్రీజ్ లోకొచ్చేసాడు. ఆ [more]

Update: 2019-06-12 05:47 GMT

సీనియర్ హీరో రాజశేఖర్ గత కొంతకాలంగా హిట్ అనే పదానికి మొహం వాచిపోయాడు. కానీ అనూహ్యంగా పిఎస్వీ గరుడ వేగా సినిమాతో మల్లి క్రీజ్ లోకొచ్చేసాడు. ఆ సినిమా తర్వాత చాలా రోజులకి ప్రశాంత్ వర్మ తో కల్కి సినిమా చేసాడు. కల్కి సినిమాపై మంచి అంచనాలున్నాయి. కల్కి ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాక కల్కి విడుదల డేట్ లాక్ చెయ్యకపోయేసరికి కల్కి సినిమా రీ షూట్స్ వలన విడుదల ఆలస్యమంటూ ప్రచారం జరిగిది. అయితే తాజాగా అధికారికంగా కల్కి విడుదల డేట్ లాక్ చేసారు నిర్మాతలు. కల్కి జూన్ 28 న విడుదలకబోతుందని…

అయితే రాజశేఖర్ సోలోగా దిగుదామనుకుంటే.. తాజాగా రాజశేఖర్ కి మరో ఇద్దరు హీరోలు పోటీకి వచ్చారు. వారిలో సాయి కుమార్ కొడుకు ఆది సాయి కుమార్ బుర్ర కథ సినిమాతో రాబోతున్నాడు. బుర్రకథ సినిమా మీద ట్రేడ్ లో ఎలాంటి క్రేజ్ లేదు. ఎందుకంటే ఆది సాయి కుమార్ ప్రస్తుతం ప్లాప్స్ లో ఉన్నాడు. ఇక రాజశేఖర్ కి పోటీకి రాబోతున్న మరోహీరో శ్రీ విష్ణు. నివేత థామస్ హీరోయిన్ గా శ్రీ విష్ణు హీరోగా బ్రోచేవారెవరురా అనే గమ్మత్తైన టైటిల్ తో శ్రీ విష్ణు కూడా జూన్ 28 నే దిగబోతున్నాడు. మరి శ్రీ విష్ణు సినిమాస్ అంటే కాస్త ప్రేక్షకుల్లో స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అతని సినిమాలు అంత బావుంటాయి. శ్రీ విష్ణు సినిమాలు బ్లాక్ బస్టర్స్ కాకపోయినా శ్రీ విష్ణు నటనకు స్పెషల్ అభిమానులుంటారు. మరి రాజశేఖర్ కి బ్రోచేవారెవరురా సినిమా గట్టి పోటీ ఇస్తుందేమో చూడాలి. లేదా కల్కి హిట్ అయ్యి బ్రోచేవారెవరురా కి ఎసరు పెడుతుందో చూద్దాం.

Tags:    

Similar News