రాజశేఖర్ ఎందుకు ఇలా అయిపోయాడు?

యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ గరుడ వేగ సినిమాతో చాలా ఏళ్ళు తరువాత మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చాడు. ఈసినిమా క్రిటిక్స్ పరంగా, ప్రేక్షకుల పరంగా నచ్చినప్పటికీ [more]

Update: 2019-06-29 16:32 GMT

యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ గరుడ వేగ సినిమాతో చాలా ఏళ్ళు తరువాత మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చాడు. ఈసినిమా క్రిటిక్స్ పరంగా, ప్రేక్షకుల పరంగా నచ్చినప్పటికీ ఫ్యాన్స్ కి మాత్రం రాజశేఖర్ లుక్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనలో మునుపటి జోష్ లేదని…ఎనర్జీ లేదని..శారీరకంగా మార్పులు వచ్చాయని ఫ్యాన్స్ తమ బాధను వక్తం చేసారు.

ఇదివరకు చేసిన సినిమాలతో పోల్చుకుంటే గరుడ వేగలో ఆ జోష్ కనిపించలేదని అభిప్రాయపడ్డారు. అయితే గరుడ వేగ లో జరిగిన తప్పులు కల్కి లో జరగకూడదని రాజ శేఖర్ లుక్స్ విషయంలో చాలానే జాగ్రత్తలు తీసుకున్నారు.కాస్త ఒళ్లు చేసి, ముఖంలో కళ తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడని అనుకున్నారు. కానీ కల్కి తో పోల్చుకుంటే గరుడ వేగం లోనే బెటర్ గా ఉన్నాడనే ఫీలింగ్ కలిగింది ప్రేక్షకులకు భావిస్తున్నారు.

చర్మం పై ముడతలు రావడం, విగ్గు సరిగా సరిగా కుదరకపోవడం…మేకప్ తేడా కొట్టడం..మొహం లో కళ పోవడం జరిగాయి. పూర్తిగా నీరసించి.. ఎనర్జీయే లేనట్లు కనిపించిన రాజశేఖర్‌ను చూసి జనాలు షాకైపోయారు. ఆ బాడీ తో అతను ఫైట్స్ చేస్తుంటే చూడ్డానికే ఏదోలా అనిపించిందని అంటున్నారు. ఈమూవీ రాజశేఖర్ కాకుండా మంచి యంగ్ హీరో చేసి ఉంటె వేరేలా ఉండేది అంటున్నారు సాధారణ ప్రేక్షకులు.

Tags:    

Similar News