అందుకే రజనీ సూపర్ స్టార్ అయ్యారు..!

టాక్ పరంగా సినిమాలు హిట్ అయితే సరిపోదు. కలెక్షన్స్ కూడా రావాలి. డిస్ట్రిబ్యూటర్స్ కి ఏ మాత్రం నష్టం రాకుండా ఉండాలి. అప్పుడే ఆ సినిమా పూర్తిగా [more]

Update: 2019-02-06 07:59 GMT

టాక్ పరంగా సినిమాలు హిట్ అయితే సరిపోదు. కలెక్షన్స్ కూడా రావాలి. డిస్ట్రిబ్యూటర్స్ కి ఏ మాత్రం నష్టం రాకుండా ఉండాలి. అప్పుడే ఆ సినిమా పూర్తిగా హిట్ అయినట్టు. రజనీ సినిమాలు కొన్న డిస్ట్రిబ్యూటర్స్ వరుసగా నష్టపోతున్నారు. కాలా, 2.0 లాంటి చిత్రాలు టాక్ పరంగా హిట్ అయినా వసూళ్లపరంగా ఫెయిల్ అయ్యాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కించడంతో డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టమే వచ్చాయి. ప్రాంతాల వారీగా కూడా కలెక్షన్లలో తేడాలున్నాయి. ఇక రజనీ లేటెస్ట్ మూవీ పేట పర్లేదు అనిపించుకుంది. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యి టాక్ పరంగా, వసూళ్లపరంగా సక్సెస్ అయింది. దీంతో తమిళం వరకు అయినా ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు ఊరటను ఇచ్చింది.

రెమ్యునరేషన్ తగ్గించుకుని…

కానీ తెలుగులో ఈ సినిమా కొన్న ప్రొడ్యూసర్ కి కొంతమేరకు నష్టం తప్పలేదని తెలుస్తుంది. ఈ అనుభవాల నేపథ్యంలో రజనీ తన తదుపరి సినిమాకు పారితోషకాన్ని తగ్గించుకోవాలని డిసైడ్ అయ్యాడట. ప్రస్తుతం రజనీ మురగదాస్ డైరెక్షన్ లో రాజకీయ నేపథ్యంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కోసం తన పారితోషకాన్ని తగ్గించుకుంటే సినిమా ఓ మోస్తరుగా ఉన్నా డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టం రాకుండా ఉంటుందని భావిస్తున్నాడట. ఈ సినిమాకి ‘నార్కాలి’ అనే టైటిల్ ను పెట్టనున్నారు. నార్కాలి అంటే తెలుగులో ‘కుర్చీ’ అని అర్ధం.

Tags:    

Similar News