ద‌ర్బార్ లో ర‌జ‌నీ రోల్ ఇదే..!

మొదటిసారి మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ దర్బార్ మూవీ చేస్తున్నాడు. తాజాగా మొదలైన దర్బార్ సినిమా మీద అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. క్రేజీ కాంబో అవడం, మురుగదాస్ క్రేజ్, [more]

Update: 2019-04-17 06:08 GMT

మొదటిసారి మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ దర్బార్ మూవీ చేస్తున్నాడు. తాజాగా మొదలైన దర్బార్ సినిమా మీద అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. క్రేజీ కాంబో అవడం, మురుగదాస్ క్రేజ్, రజినీకాంత్ స్టయిల్ అన్నీ మిక్స్ అవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. రజనీ గత చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయినా ప్రస్తుతం రజనీ దర్బార్ మీద అలాంటి ఎఫెక్ట్ ఏం కనిపించ‌డం లేదు. ఇక మురుగదాస్ ఈ సినిమాలో రజనీకాంత్ ని రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో చూపించబోతున్నాడట. ఎప్పటి నుండో ఈ సినిమాలో రజనీకాంత్ రెండు పాత్రలో నటిస్తాడని, ఒక పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా ఇరగదియ్యనున్నాడనే న్యూస్ ప్రచారంలో ఉంది.

పోలీస్ ఆఫీస‌ర్ గా…

తాజాగా ఈ సినిమాలో రజనీకాంత్ రెండు పాత్రలో కనిపిస్తాడని, అది కూడా తండ్రి కొడుకుల పాత్రలు చేస్తున్నాడని అంటున్నారు. ఈ రెండు పాత్రల్లో ఒకటి పోలీస్ ఆఫీసర్ కాగా మరొకటి సోషల్ యాక్టివిస్ట్ గా కనిపించనున్నాడట. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్థార్ నయనతార హీరోయన్ గా నటిస్తుంది. ఇక ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ముంబైలో జరుగుతోంది. దాదాపు ఇరవై రోజుల పాటు జరగనున్న ఈషెడ్యూల్ లో కీలక సన్నివేశాలను ఈ మొదటి షెడ్యూల్ లో తెరకెక్కించనున్నట్లుగా సమాచారం.

Tags:    

Similar News