యూరప్ వెళ్లనున్న సూపర్ స్టార్..!

Update: 2018-09-01 13:49 GMT

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం 165వ చిత్రం చేస్తున్నాడు. అతను లేటెస్ట్ గా చేసిన 'కాలా' సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సినిమా హిట్ అవ్వాలని రజనీతో పాటు ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీ అయ్యిపోయాడు రజనీ. కొన్ని నెలలు కింద స్టార్ట్ అయినా ఈ షూటింగ్ ఇటీవలే డార్జిలింగ్, చెన్నైలో మేజర్ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. తర్వాత షెడ్యూల్ యూరప్ లో జరగబోతుందట. నలభై రోజులు పాటు జరుగుతున్న ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు రెండు పాటలను చిత్రీకరించనున్నారు.

రజనీ డ్యూయల్ రోల్

ఇందులో రజనీ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. “పిజ్జా” ఫేం కార్తి సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని సన్ పిక్చర్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి, బాబి సింహ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ నవజుద్దిన్ సిద్దికి ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. హీరోయిన్స్ గా మెగా ఆకాష్, త్రిష్ కనిపించనున్నారు.

 

Similar News