సూపర్ స్టార్ మాములుగా షాకివ్వలేదుగా..!

ఈ ఏడాది పేటతో దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకున్న రజినీకాంత్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండకుండా వరుసగా సినిమాల మీదే దృష్టి పెడుతున్నాడు. యంగ్ హీరోలకన్నా ఫాస్ట్ గా [more]

Update: 2019-04-09 08:00 GMT

ఈ ఏడాది పేటతో దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకున్న రజినీకాంత్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండకుండా వరుసగా సినిమాల మీదే దృష్టి పెడుతున్నాడు. యంగ్ హీరోలకన్నా ఫాస్ట్ గా సినిమాలు చేస్తున్న రజనీకాంత్ ఈ ఏడాది టాప్ డైరెక్టర్ మురుగదాస్ తో మరో సినిమాని మొదలు పెట్టబోతున్నాడు. ఇప్పటివరకు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న మురుగదాస్.. ఇప్పుడు సడన్ గా షాకిచ్చాడు. ఇప్పటివరకు కామ్ గా తన పని తాను చేసుకుపోయిన మురుగదాస్ రజనీకాంత్ అభిమానులకు సర్ప్రైజ్ షాకిచ్చాడు. చాలా సైలెంట్ గా రజనీకాంత్ – మురుగదాస్ ల కాంబో మూవీ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని కూడా ఈ రోజు విడుదల చేసి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు.

పోలీస్ అధికారిగా…

రజనీకాంత్ – మురుగదాస్ కాంబోలో తెరకెక్కబోయే మూవీ టైటిల్ దర్బార్. మరి అంత పవర్ ఫుల్ టైటిల్ తో ఆ సినిమాలో రజనీ లుక్ ఎలా ఉంటుందో కూడా దర్బార్ ఫస్ట్ లుక్ తో చెప్పేసాడు. అసలు ఎలాంటి హడావిడి లేకుండా వదిలిన ఈ టైటిల్, ఫస్ట్ లుక్ తో సూపర్ స్టార్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమా ముంబై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండగా రజనీ పోలీస్ ఆఫిసర్ గా నటిస్తున్నాడు. ఇక దర్బార్ లో రజనీకి జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించనుంది. మురుగదాస్.. రజనీకాంత్ తో కలిసి దర్బార్ సెట్స్ మీదకి ఏప్రిల్ 10 నుండి వెళ్లబోతున్నాడు. ఈ సినిమాకి యువ కెరటం అనిరుద్ సంగీతమందిస్తున్నాడు.

Tags:    

Similar News