భాషా తర్వాత మళ్లీ సంక్రాంతికి

సర్కార్, నవాబ్ వంటి హిట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత వల్లభనేని అశోక్ హ్యాట్రిక్ దిశగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన “పెట్టా” చిత్రాన్ని “పేట” [more]

Update: 2018-12-26 13:27 GMT

సర్కార్, నవాబ్ వంటి హిట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత వల్లభనేని అశోక్ హ్యాట్రిక్ దిశగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన “పెట్టా” చిత్రాన్ని “పేట” పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న విషయం విదితమే. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వల్లభనేని అశోక్ మాట్లాడుతూ “రజనీకాంత్ హిట్ మూవీ “బాషా” తరువాత మళ్లీ సంక్రాంతికి “పేట” రూపంలో థియేటర్లలో సందడి చేయటానికి రజినీకాంత్ రావటం సంతోషంగా ఉంది. జనవరి మొదటి వారంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి సంక్రాంతి కానుకగా రెండో వారంలో రిలీజ్ చేయనున్నాం” అని పేర్కొన్నారు.

తారాగణం, సాంకేతిక నిపుణులు

త్రిష, సిమ్రాన్, విజయ్ సేతుపతి, బాబీ సింహ, నవాజుద్దిన్ సిద్ధికి మాళవిక నాయర్, మేఘ ఆకాష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుద్, కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం: కార్తీక్ సుబ్భారాజ్,నిర్మాత: వల్లభనేని అశోక్.

Tags:    

Similar News