చరణ్ – ఎన్టీఆర్ లు అలా కలుస్తారా

రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఇద్దరు స్టార్ హీరోల కలయికలో తెరకెక్కుతున్న RRR సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. సినిమా మొదలైనప్పటి నుంచి సినిమా [more]

Update: 2019-10-07 07:02 GMT

రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఇద్దరు స్టార్ హీరోల కలయికలో తెరకెక్కుతున్న RRR సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. సినిమా మొదలైనప్పటి నుంచి సినిమా మీద అంచనాలు కాదు ఆశక్తి పెరిగిపోతుంది. అల్లూరు సీతారామరాజుగా చరణ్, కొమరం భీంగా ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా కథపై చాలామంది లో చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. అదేమిటంటే అసలు కొమరం బీమ్, అల్లూరి విడివిడిగా పోరాటాలు చేసారు? కానీ వీరిద్దరూ ఎప్పుడు కలుసుకున్నారు? ఈ సినిమాలో అసలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబో సీన్స్ ఉంటాయా? ఉంటే అవి ఎప్పుడు ఉంటాయనే డౌట్స్ లో ఎన్టీఆర్, మెగా ఫాన్స్ ఉన్నారు.

ఆ సాహసం కీలకం…

తాజాగా వినబడుతున్న కథ ప్రకారం RRR సినిమాలో ఎన్టీఆర్ ఒక చిన్న పాపని కాపాడడానికి పెద్ద సాహసం చేస్తాడని ఆ ఎపిసోడ్ సినిమాకే కీలకం అని ఆ పాపను కాపాడిన క్రమంలోనే రామ్ చరణ్ అల్లూరి పాత్ర ఎన్టీఆర్ కొమరం భీం తో చేతులు కలిపి పోరుబాట పడతారని అంటున్నారు. అలాగే మొదటి నుంచి వినబడుతున్న న్యూస్ ప్రకారం ఆ పాపను కాపాడే క్రమంలో ఎన్టీఆర్ పులితో కూడా ఫైట్ చేస్తాడని అంటున్నారు. ఇక సినిమాలో సందర్భానుచితంగా కేవలం నాలుగు పాటలకు మాత్రమే చోటుంటుంది అని అంటున్నారు.

 

Tags:    

Similar News