రాజమౌళి ఏం మారలేదు అంటున్న ఎన్టీఆర్

రాజమౌళి – ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ‘స్టూడెంట్ నెం.1’ రిలీజ్ అయ్యి నిన్నటితో 18 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రాజమౌళి [more]

Update: 2019-09-28 07:28 GMT

రాజమౌళి – ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ‘స్టూడెంట్ నెం.1’ రిలీజ్ అయ్యి నిన్నటితో 18 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రాజమౌళి అండ్ ఎన్టీఆర్ తమ ట్విట్టర్ ఖాతాలో 18 ఏళ్ళ కిందట షూటింగ్ టైములో దిగిన ఫొటోస్ షేర్ చేసుకుని అలానే ఇప్పుడు అదే ఫొటోస్ కి అచ్చం అటువంటి స్టిల్ ఇచ్చి దిగిన ఫొటోస్ ఇద్దరూ షేర్ చేసుకుని ఆ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు.

ఎంతో మారిపోయింది…

రాజమౌళి ఓ ఫోటో షేర్ చేస్తూ…”18 ఏళ్ళు అయింది. స్టూడెంట్ నెం.1 ఈరోజే రిలీజ్ అయింది. అనుకోకుండా ఈరోజు మేమిద్దరం రామోజీ ఫిలిం సిటీలోనే ఉన్నాం. చాలా మారిపోయింది..తారక్ సన్నగా మారిపోయాడు. నేను పెద్ధవాడిని అయ్యాను”. అంటూ కామెంట్ పెట్టాడు. ఎన్టీఆర్ ఏమో కాకతాళీయంగా మేము ఈ రోజు రామోజీ ఫిలిం సిటీలో ఉన్నాం. అనుకోకుండా మేము ఇక్కడే రామోజి ఫిలింసిటీ లో #RRR షూటింగ్ చేస్తున్నాం. స్టూడెంట్ నెంబర్ 1లో ఓ సీన్ ఎక్కడైతే షూట్ చేసామో సరిగా అక్కడే ఓ సీన్ చిత్రీకరించాం.. ఎంతో మారిపోయింది కానీ జక్కన్న తో పని చేయడం లో ఫన్ మాత్రం సేమ్” అంటూ ట్వీట్ చేశారు. వారు దిగిన పాత ఫొటోస్ కొత్త ఫొటోస్ రెండు కలిపి షేర్ చేసారు.

 

Tags:    

Similar News