#RRR టైటిల్ సాంగ్ @ 3 కోట్లు

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తునం #RRR సినిమా షూటింగ్ ప్రస్తుతం గ్యాప్ లేకుండా చిత్రీకరణ జరుగుతుంది. గత నెల్లో స్టార్ [more]

Update: 2019-07-02 06:36 GMT

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తునం #RRR సినిమా షూటింగ్ ప్రస్తుతం గ్యాప్ లేకుండా చిత్రీకరణ జరుగుతుంది. గత నెల్లో స్టార్ హీరోలిద్దరూ గాయాల పాలై #RRR షూటింగ్ కి బ్రేకిచ్చిన రాజమౌళి… ఇప్పుడు మాత్రం ఫుల్ స్వింగ్ లో షూటింగ్ చేస్తున్నాడు. అల్లూరి సీత రామ రాజుగా రామ్ చరణ్, కొమరం బీమ్ గా ఎన్టీఆర్, సీత గా అలియా భట్ లు నటిస్తున్న ఈ సినిమా బడ్జెట్ 300 కోట్లదాకా ఉంది. భారీ సెట్స్ నిర్మాణంతో పాటుగా భారీ యాక్షన్స్ సన్నివేశాలు కూడా ఈ సినిమాలో ఉండబోతున్నాయి. రాజమౌళి అంటే రిచ్ సెట్స్, భారీ యాక్షన్ సీన్స్ కామన్.

అయితే తాజాగా రాజమౌళి పాటల కోసం కూడా కోట్లు ఖర్చు పెట్టబోతున్నాడట. రామ్ చరణ్ – ఎన్టీఆర్ ల మీద ఒక టైటిల్ సాంగ్ కోసమే ఏకంగా మూడు కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. ఎన్టీఆర్ తో తియ్యబోయే యాక్షన్ సన్నివేశాల కోసమే 12 కోట్లు ఖర్చు పెట్టిస్తున్న రాజమౌళి… ఇప్పుడు టైటిల్ సాంగ్ కోసం మూడు కోట్లు అంటే పెద్ద ఖర్చు కాదు…. రాజమౌళి ఒక పాట కోసం ఇంత ఖర్చు పెడుతున్నాడంటేనే అది హాట్ టాపిక్ అయ్యింది. ఇకపోతే ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారో మాత్రం రాజమౌళి ఇంకా సస్పెన్స్ లోనే పెట్టాడు. ఇకపోతే బాలీవుడ్ నుండి అజయ్ దేవగణ్, తమిళ నటుడు సముద్రఖనిలు కూడా #RRR లో కీలకపాత్రలు పోషించబోతున్నారు.

Tags:    

Similar News