#RRR సెట్స్ లో జక్కన్న జాగ్రత్తలు..!

Update: 2018-11-16 07:00 GMT

దర్శకధీరుడు రాజమౌళి తన #RRR సినిమాను మరికొన్ని రోజుల్లో స్టార్ట్ చేయనున్నారు. ఈ నెల 19 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఒక్క క్లూ కూడా బయటికి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు జక్కన్న. ఇంతవరకు ఈ సినిమా స్టోరీ ఏంటి.. అసలు ఎటువంటి జోనర్.. ఇందులో ఎవరెవరు నటిస్తున్నారు అన్న విషయాలు కూడా అక్కడ బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

సెక్యూరిటీ నడుమ షూటింగ్

ఈ నేపధ్యంలో #RRR షూటింగ్ సెట్స్ లో ఎవరూ సెల్ ఫోన్స్ ఉపయోగించకూడదు అని నిషేధం పెట్టాడట జక్కన్న. ఫొటోస్ ఎక్కడ లీక్ అవుతున్నాయో అని ముందు జాగ్రత్తగా ఇలా చేస్తున్నాడట. 'బాహుబలి' టైంలో ఇదే చేశాడు కానీ సినిమాలో హైలైట్ సీన్ బయటికి వచ్చేసింది. అయితే ఈసారి అటువంటి తప్పులు జరగకుండా చేసుకుంటున్నాడట. హైదరాబాద్ శివారున కోకాపేటలో ఓ సెట్ వేసి అక్కడ షూట్ చేయనున్నాడు. భారీ సెక్యూరిటీ మధ్యన ఈ సినిమా షూటింగ్ జరగనుంది.

చైనా నుంచి జామర్స్...

అయినా ఎందుకైనా మంచిది అని జామర్స్ వాడుతున్నాడట. ఎవరైనా సీక్రెట్ కెమెరాలు పెట్టుకొచ్చి ఏదన్నా వీడియో తీస్తారేమోనని.. చైనా నుండి తెప్పించిన జామర్స్ ను సెట్లో అమర్చనున్నారట. దానివల్ల ఎవరైనా సీక్రెట్ కెమెరాలు తీసుకొచ్చి షూట్ చేద్దాం అనుకున్నా అవి పని చేయకుండా జామర్స్ చూసుకుంటాయి అంట. కాబట్టి ఈ సారి జక్కన్న బాగానే జాగ్రత్తలు తీసుకుంటున్నాడని అర్ధం అవుతుంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

Similar News