ఎన్టీఆర్ టీంకి వార్నింగ్ ఇస్తున్న రాజమౌళి..!

Update: 2018-12-13 06:51 GMT

రాజమౌళి ఇప్పుడు ఇద్దరు బిగ్ స్టార్స్ ని హ్యాండిల్ చేస్తున్నాడు. రంగస్థలంతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు స్టార్ హీరో రామ్ చరణ్. ఇక ఎన్టీఆర్ కూడా బోలెడంత క్రేజ్ ఉన్నస్టార్ హీరో. మరి అలాంటి స్టార్స్ తో రాజమౌళి సినిమా అంటే అది ఎలా ఉండబోతుందో అనేది కనీసం ఊహకి కూడా అందదు. ప్రభాస్ ని కూడా మంచి క్రేజ్ ఉన్నప్పుడే అతనితో బాహుబలి సినిమా చేస్తే ప్రభాస్ కేవలం ఇండియాలోనే కాదు.. వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందాడు. ఇక తాజాగా ఎన్టీఆర్, చరణ్ లతో #RRR మొదలుపెట్టేశాడు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసిన రాజమౌళి సెకండ్ షెడ్యూల్ కోసం లాంగ్ గ్యాప్ తీసుకోబోతున్నాడు. ఇక ఫస్ట్ షెడ్యూల్ లో ఇద్దరు హీరోల మీద యాక్షన్ సన్నివేశాలను రాజమౌళి తెరకెక్కించిన విషయం తెలిసిందే.

మళ్లీ సిక్స్ ప్యాక్ లోకి...

అయితే ఫస్ట్ షెడ్యూల్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు గుబురు గెడ్డంతోనే కనబడతారనేది వారి ఒరిజినల్ లుక్స్ చూస్తుంటే తెలుస్తుంది. ఇక సెకండ్ షెడ్యూల్ మొదలయ్యేసరికి ఎన్టీఆర్ ఫిజికల్ గా కూడా మేకోవర్ కాబోతున్నాడట. అరవింద తర్వాత #RRR షెడ్యూల్ కోసం కాస్త లావెక్కిన ఎన్టీఆర్, తదుపరి #RRR షెడ్యూల్ కోసం ఫిజికల్ గా మేకోవర్ అవుతున్నాడు అంటే మళ్లీ సిక్స్ ప్యాక్ లాంటి కండలు తిరిగిన బాడీతో కనిపిస్తాడేమో అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉత్సాహపడుతున్నారు. అయితే అరవింద సమేత కోసం ట్రైనర్ లాయిడ్‌ స్టీవెన్స్‌ ఆధ్వర్యంలో మంచి ఫిజిక్ లోకి మారిన ఎన్టీఆర్ ఇప్పుడు #RRR కోసం కూడా లాయిడ్‌ స్టీవెన్స్‌ ఆధ్వర్యంలో జిమ్ చేస్తున్నాడట.

లుక్ బయటకు వదిలేవరకు ఆగాల్సిందే...

అయితే ఎన్టీఆర్ మేకోవర్ గురించి కానీ, అతని జిమ్ ఫొటోస్, వీడియోస్ కానీ ఎక్కడా లీక్ కానివ్వొద్దని రాజమౌళి ఎన్టీఆర్ టీంకి ఆర్డర్ పాస్ చేశాడట. ఫిజికల్‌ ట్రాన్స్‌ ఫర్మేషన్‌ కి సంబంధించిన ఫొటో గానీ, జిమ్ ఫొటోస్ కానీ ఎక్కడా బయటికి పోనివ్వొద్దని ఎన్టీఆర్ టీంకి రాజమౌళి సీరియస్ గా చెప్పేశాడట. మరి జిమ్ ట్రైనర్లు ఎవరైనా తమ పనితనం బయటికి తెలియాలని, వారు ట్రైనింగ్ ఇచ్చే సెలబ్రిటీస్ తో ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. ఇక ఆలా కూడా ఎన్టీఆర్ ఫొటోస్ బయటికి రాకూడని రాజమౌళి వార్నింగ్ ఇచ్చాడట. మరి తాను ఎన్టీఆర్ #RRR లుక్ ని బయటికి వదిలే వరకు ఎలాంటి క్లూ కూడా మీడియాకి దొరక కూడదని రాజమౌళి ఆలోచనలా ఉంది.

Similar News