ఆదిపురుష్ పర్ఫెక్ట్ అంటున్న రాజమౌళి!!

ప్రభాస్ తో బాహుబలి చేసిన రాజమౌళి ఏడాది గ్యాప్ తో ఎన్టీఆర్, రామ్ చరణ్ తో RRR సినిమా చేస్తున్నాడు. కానీ ప్రభాస్ సాహో సినిమా చేసేసాడు. [more]

Update: 2020-08-24 04:43 GMT

ప్రభాస్ తో బాహుబలి చేసిన రాజమౌళి ఏడాది గ్యాప్ తో ఎన్టీఆర్, రామ్ చరణ్ తో RRR సినిమా చేస్తున్నాడు. కానీ ప్రభాస్ సాహో సినిమా చేసేసాడు. తర్వాత రాధేశ్యాం, అలాగే నాగ్ అశ్విన్ తో సినిమా .. తాజాగా ఓం రనౌత్ తో ఆదిపురుష్ సినిమా ఎనౌన్స్ చేసాడు. అయితే RRR షూటింగ్ కి బ్రేకిచ్చిన రాజమౌళి కరోనా బారిన పడ్డాడు. ప్రభాస్ ఆదిపురుష్ ప్రకటించిన చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఆదిపురుష్ పై బాహుబలి రాజమౌళి నోరు విప్పాడు. భారీ బడ్జెట్ ఆదిపురుష్ పై రాజమౌళి మాట్లాడడం చూస్తే సినిమాపై మరింత క్రేజ్, అంచనాలు పెరిగిపోయాయి.

ఆదిపురుష్ ఫస్ట్ లుక్ పోస్టర్ తాను చాలా రోజుల క్రిష్టమే చూశానని… ఆదిపురుష్ సినిమా రావడానికి ఇదే సరైన సమయమని… ఎందుకంటే ఈమధ్యనే ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరిగిందని… ఇండియా లో ఇప్పుడు రాముడి గురించి చర్చ జరుగుతోందని…. ఇటువంటి సమయంలో రాముడి మీద సినిమా వస్తే చాలా బాగుంటుందని అన్న రాజమౌళి బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ఇప్పుడు ఆదిపురుష్ సినిమాతో హీరో ప్రభాస్ స్థాయి మరింతగా పెరుగుతుందని రాజమౌళి అంటున్నాడు. మరి రాజమౌళి ఆదిపురుష్ పై ఇలా స్పందించడంపై ప్రభాస్ ఫాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు.

Tags:    

Similar News