పాత్ర రివీల్ చేసి తలనొప్పి తెచ్చుకున్నాడు

ప్రస్తుతం అందరి దృష్టి రాజమౌళి తీస్తున్న #RRR పైనే. మూవీ స్టార్ట్ అయినప్పుటి నుండి రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే లేటెస్ట్ గా జక్కన్న ప్రెస్ మీట్ [more]

Update: 2019-03-15 11:23 GMT

ప్రస్తుతం అందరి దృష్టి రాజమౌళి తీస్తున్న #RRR పైనే. మూవీ స్టార్ట్ అయినప్పుటి నుండి రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే లేటెస్ట్ గా జక్కన్న ప్రెస్ మీట్ పెట్టి రామ్ చరణ్, ఎన్టీఆర్ లు వేసే పాత్రలు ఏంటో చెప్పి చిక్కుల్లో ప‌డ్డాడు. ఇందులో చరణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర, ఎన్టీఆర్ కొమ‌రం భీమ్ పాత్ర చేస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య. అప్పట్లో కృష్ణ అల్లూరి సీతారామ‌రాజు’ తీసిన‌ప్పుడు విమ‌ర్శ‌కులు చెల‌రేగిపోయారు. సీతారామరాజు వంటి విప్ల‌వ‌వీరుడి క‌థ‌లో రొమాన్స్‌ చూపించ‌డం ఏమిట‌ని అప్పుడు విమర్శలు గుప్పించారు.

విమ‌ర్శ‌లు వ‌స్తాయా..?

అలానే ఎన్టీఆర్ కొమ‌రం భీమ్ పాత్ర చేస్తున్నాడు. యువ‌కులు భీమ్ ను ఆద‌ర్శంగా తీసుకుంటారు. అలాంటి భీమ్ ను సినిమాలో ఎలా చూపిస్తారు అన్నది ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే అటు అల్లూరి, ఇటు కొమ‌రం.. ఇద్ద‌రి జీవితాల్లో జ‌రిగిన క‌థలేవీ జ‌క్క‌న్న చూపించ‌క‌పోవొచ్చు కానీ జక్కన్న తన క్రియేషన్ తో అతను అనుకుంది చూపించనున్నాడు. ఇక్కడ తమ హీరోలని ఎలా చూపిస్తారు అనేది పక్కన పెడితే అల్లూరి ఆంధ్ర కి చెందిన వారు. భీమ్ తెలంగాణ కి చెందిన వారు. మా ఆంధ్రా వీరుడ్ని బాగా చూపించాడా? మా తెలంగాణ యోధుడ్ని బాగా చూపించాడా’ అనే పోటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇటువంటివి ఏమీ ఉండవు అని…. కృష్ణ‌ అల్లూరి సీతారామ‌రాజు తీస్తున్న‌ప్పుడు వివాదాలు వ‌చ్చాయ‌ని, ఆయ‌న సినిమా ఆప‌లేదు. అలానే అన్న‌మ‌య్య స‌మ‌యంలోనూ ఇంతే. కాబ‌ట్టి ఈ సినిమాని కూడా ఎవరు ఆపలేరని చెబుతున్నారు. జక్కన్న ఇద్దరినీ బాలన్స్ చేయగలడని టాక్.

Tags:    

Similar News