అనుకున్న టైంకి జక్కన్న చెక్కుతాడా..?

Update: 2018-11-13 07:23 GMT

'బాహుబలి' లాంటి ఎపిక్ మూవీ తరువాత రాజమౌళి ఎటువంటి సినిమా తీస్తాడు.. ఎవరితో చేస్తాడు అని అంతా ఉత్కంఠగా ఎదురు చూశారు. 'బాహుబలి' ప్రమోషన్స్ లో ఎటువంటి గ్రాఫిక్స్.. విజువల్ ఎఫెక్ట్స్ లేకుండా చిన్న సినిమా తీయాలనుకుంటున్నట్లు చెప్పాడు. కానీ షాకింగ్ గా ఎన్టీఆర్ - రామ్ చరణ్ లతో సినిమా తీయబోతున్నట్టు ప్రకటించాడు జక్కన్న. అనౌన్స్ చేసి దాదాపు ఏడాది కావొస్తుంది. కానీ ఇంతవరకు వరకు సెట్స్ మీదకు వెళ్లలేదు ఈ సినిమా.

చెప్పిన టైంకి రిలీజ్ అయ్యేనా..?

ఫైనల్ గా రెండు రోజులు కిందట ఈ సినిమా ఓపెనింగ్ జరిగింది. ఈనెల 18 నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. స్క్రిప్ట్ ప్రకారం ఇందులో కూడా గ్రాఫిక్స్.. విజువల్ ఎఫెక్ట్స్ తప్పేలా లేవు. స్క్రిప్ట్ వర్క్.. ప్రి ప్రొడక్షన్ కోసం ఏడాది సమయం వెచ్చించడాన్ని బట్టి ఇది కూడా జక్కన్న రేంజ్ కి తగ్గ సినిమానే అవుతుందని జనాలు ఆశిస్తున్నారు. ఓపెనింగ్ రోజు ఈ సినిమా 2020 సమ్మర్ లో రిలీజ్ అవుతుందని ప్రకటించారు. కానీ నిజానికి ఆ సమయానికి ఈ సినిమా వస్తుందా..? అన్న డౌట్స్ స్టార్ట్ అయ్యాయి. రాజమౌళి స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన తరువాత ఏ సినిమాను అనుకున్న టైంలో కంప్లీట్ చేయలేదు.

సినిమా టైటిల్ ఇదేనా..?

చిన్న సీన్ విషయం కూడా ఎక్కడా కంప్రమైజ్ అవ్వనని రాజమౌళి షూటింగ్ ఆలస్యం కావడం అన్నది సహజమైన విషయం. 'బాహుబలి' రెండు పార్ట్స్ విషయంలో ఎంత ప్లానింగ్ తో ఉన్నప్పటికీ రెండు సినిమాలూ ఆలస్యమయ్యాయి. దీంతో #RRR కూడా లేట్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఎంత లేట్ అయినా ప్రేక్షకులని ఎక్కడ నిరాశపరచడు జక్కన్న. జక్కన ఒక డేట్ ప్రకటిస్తే.. ప్రేక్షకులు ఇంకో డేట్ కు ఫిక్స్ అవుతుంటారు. సో లేట్ అయినా ప్రేక్షకులు పెద్దగా ఫీల్ అవ్వరు. ఎందుకంటే వారికి రాజమౌళి గురించి ముందుగానే తెలుసు కాబట్టి. ఈ సినిమాకు 'రామ రవాణ రాజ్యం' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

Similar News