#RRR లో నిర్మాత ఉన్నా లేనట్టే..!

జక్కన్న ప్రస్తుతం #RRR రెండో షెడ్యూల్ ను డైరెక్ట్ చేసే పనిలో ఉన్నాడు. ఎన్టీఆర్ – రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సినిమా [more]

Update: 2019-01-25 08:50 GMT

జక్కన్న ప్రస్తుతం #RRR రెండో షెడ్యూల్ ను డైరెక్ట్ చేసే పనిలో ఉన్నాడు. ఎన్టీఆర్ – రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సినిమా నుండి ఫస్ట్ లుక్ ఒక్కటి కూడా బయటికి రాకుండానే ఈ సినిమాను కొనేందుకు బయర్స్ ముందుకు వస్తున్నారట. అయితే ఎవరికి ఎంతకు ఇవ్వాలి అనేది నిర్మాత దానయ్య డిసైడ్ చేయరట. డబ్బు పెట్టేది ఆయనే అయినా ఈ చిత్రానికి కర్త, కర్మ, క్రియ అన్నీ రాజమౌళినే. జక్కన్న టీం ఏం చెబితే అది చేయాలని నిర్మాతకు ఆల్రెడీ చెప్పినట్టు టాక్. షూటింగ్ అవ్వడానికి ఇంకా ఏడాదిపైనే టైం ఉంది కాబట్టి అప్పుడే ఎటువంటి డీల్స్‌ క్లోజ్‌ చేయరాదని రాజమౌళి డిసైడ్‌ అయ్యి దానయ్యకు చెప్పాడట.

రాజమౌళి చెబితే అంతేగా…

సినిమా మార్కెట్‌ నానాటికీ విస్తరిస్తోన్న నేపథ్యంలో ఏడాదిలో ఏదైనా జరగొచ్చని, ఇప్పుడే అంచనా వేయడం కష్టమని.. ఒకవేళ ఇప్పుడే అమ్మితే డిస్ట్రిబ్యూటర్స్, బయర్స్ తో తలనొప్పి అని అందుకే తనకు తెలియకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదని చెప్పాడట. దీనివల్ల సినిమా షూటింగ్ కొంచెం లేట్ అయినా పర్లేదు అని రాజమౌళి భావన. రాజమౌళి ఏమి చెబితే దానికి దానయ్య ఓకే చేయడం తప్ప ఇంకా ఏమి చేయలేడు.

Tags:    

Similar News