రానా కి, రాజమౌళికే ఈ ఘనత!!

Update: 2018-04-13 09:46 GMT

బాహుబలి ఆ పేరు వింటేనే ఇప్పటికి మనసు పులకించిపోతుంది. చూసిన వాళ్ళకే ఇలా ఉంటే... తీసినవాళ్ళకి ఇంకెలా ఉండాలి. అందుకే కష్టే ఫలి అన్నట్టుగా బాహుబలి సీరీస్ ప్రపంచవ్యాప్తంగా అదరగొట్టే కలెక్షన్స్ తో అదిరిపోయే క్రేజ్ తో నిలిచింది. గత ఏడాది ఏప్రిల్ 28 న విడుదలైన బాహుబలి ద కంక్లూజన్ సినిమా అనేక అవార్డులను రివార్డులను గెలుచుకుంది. ఆ సినిమా తీసిన రాజమౌళికి అందులో నటించిన నటీనటులతో పాటు ఆ సినిమా కోసం పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్ కి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. అనేక అవార్డుల వేటలో ఉన్న బాహుబలి ప్రస్తుతం 65వ జాతీయ ఉత్తమ చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది.

రానాకు కూడా.....

ఢిల్లీ వేదికగా 65వ జాతీయ ఉత్తమ చలనచిత్ర అవార్డులను అధికారికంగా ప్రకటించారు. జ్యూరీకి నాయకత్వం వహిస్తున్న దర్శకుడు శేఖర్ కపూర్ ఈ అవార్డులను ప్రకటించారు. ఈ 65వ జాతీయ అవార్డులలో రానా నటించిన తెలుగు సినిమా ఘాజి కి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డుని గెలుచుకుంది. అలాగే రాజమౌళి బాహుబలి ఉత్తమ వినోదాత్మక చిత్ర అవార్డును గెలుచుకోగా... బెస్ట్ యాక్షన్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ కేటగిరీలకు గాను బాహుబలి మూడు అవార్డులను సొంతం చేసుకుంది.

Similar News